కిరాణా సామాన్లకు యో..యో స్టార్లు ! నవ్వు ఆగితే నామీదొట్టు!!

ఇంట్లో సరుకులు నిండుకుంటే  మనం ఏం చేస్తాం… పచారీ కొట్టుకు వెళ్లి నిత్యావసరాలు ఏమేమి కావాలో లిస్ట్ ఇస్తాం, లేదంటే గుర్తున్నవి గుర్తున్నట్టు ఒక్కొక్కటి చెప్పి పొట్లం కట్టిస్తాం.  కానీ క్రియేటివిటీ పర్సంటేజ్ కాస్త ఎక్కువగా ఉన్న కుర్రాళ్లు ఏం చేశారో తెలుసా…. యో..యో… స్టైల్లో తమకు కావాల్సింన కిరాణా లిస్ట్ ను చాలా వింతగా చెప్పేశారు. చూస్తున్నంత సేపు నవ్వు ఆగలేదంటే నమ్మండి.

సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తోన్న వేళ.. కుర్రాళ్లల్లో  క్రియేటివిటీ పొర్లిపోతోంది. అలాంటిదే ఇది. తమకు కావాల్సిన కిరాణా సరుకులను  రాప్ స్టైల్లో ఆగకుండా లిస్ట్ చదువుతున్నట్టు చదివి వినిపించారు ఈ  యో..యో స్టార్స్. వీరు సరుకులు అడుగుతున్నారా? లేక పాట పాడుతున్నారా అర్థం గాక షాపు యజమానులు వింతవింత  ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. మొత్తానికి కిరాణా షాపు 1250  పేరుతో విడుదలైన ఈ రాప్ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తోంది.

మీరూ చూడండి!

For FB Updates: CLICK HERE

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top