మహానాయకుడు సినిమా చూసి షాక్ అయిన నాగార్జున. ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతున్న వార్త..!!

అన్నగారి బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేసారు బాలకృష్ణ. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. సంక్రాంతి కానుకగా కథానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, బాక్స్ ఆఫీస్ దెగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచిపోయినా సినీ తారల నుండి మన్ననలు పొందింది, ఇక మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22 న విడుదల చేసారు. అయితే ఈ చిత్రం కి ఏ మాత్రం హైప్ లేకపోడం తో మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు మహానాయకుడు సినిమా కి.షాక్ అయ్యా..

నాగార్జున తన స్నేహితుడితో కలిసి ఇటీవలే మహానాయకుడు సినిమా చూసినట్టు సమాచారం, ఆయన స్నేహితుడి బలవంతం మీదే మహానాయకుడు సినిమా చూశారట నాగార్జున, కానీ సినిమా మొత్తం చూసాక ఎందుకు ఆడలేదో నాగార్జున కి అర్ధం కాలేదట. మహానాయకుడు సినిమా నాగార్జున కి బాగా నచ్చిందట, ఈ మాట అయన స్నేహితుడితో తెలిపారట, మహానాయకుడు సినిమా లో బాలకృష్ణ నటన అద్భుతంగా చేసాడు, సినిమా బాగుంది కానీ రెవెన్యూ ఎందుకు రాలేదో నాకు ఇంత అనుభవం ఉన్నా అర్ధం కాలేదు అని నాగార్జున చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో బాగా చెక్కర్లు కొడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ నాగార్జున కొద్ది కాలం నుండి దూరంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. అలాంటిది నాగార్జున కి బాలకృష్ణ చిత్రం విపరీతంగా నచ్చడం అనేది చర్చనీయందం అయ్యింది. ఈ వార్త పైన ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు, కానీ ఫిలిం నగర్ అంతా ఈ వార్త చెక్కర్లు కొడుతుండటం తో నిజమే అయ్యుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మొదటి పార్ట్ మూలానే.. :

కథానాయకుడు సినిమా బాగున్నా, ఎక్కువ ల్యాగ్ ఉండటం, నిడివి సినిమాను దెబ్బతిశాయి. మహానాయకుడు సినిమా నిడివి తక్కువే, కానీ కథానాయకుడు ఎఫెక్ట్ మహానాయకుడు చిత్రం మీద భారీగా పడింది, అందుకే సినిమా బాగున్నా జనాల్లోకి వెళ్లలేకపోయింది, కొన్ని ఏరియాస్ లో ఇప్పుడిప్పుడే పిక్ అప్ అవుతుంది, ఈ వారాంతం లో అయినా మూవీ కి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం లో బాలకృష్ణ నటించనున్నాడని అధికారికంగా ప్రకటించారు, అయితే స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక పక్కాగా ముందుకు వెళ్లాలని బాలకృష్ణ బోయపాటి అనుకుంటున్నారు, ఈ సినిమా తో ఇద్దరు మళ్ళి ఫారం లోకి రావడం ఖాయం అని అభిమానులు ధీమాగున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top