“బాదాం” పాలు అనుకొని ఆ చిన్నారులు “విషం” కలిపిన పాలు తాగారు!..పాలలో “విషం” ఎలా కలిసిందో తెలుసా?

ఆ పసి పిల్లల అమాయకత్వం వారి ప్రాణాల మీదకు తీసుకొనివచ్చింది. బాదాం పాలు అనుకోని విషం కలిపిన పాలు తాగేశారు ఆ ఇద్దరు చిన్నారులు. అసలు వారికి అందుబాటులో విషం కలిపిన పాలు ఎలా ఉంది అనుకుంటున్నారా? విధి ఆడే వింత నాటకంలో కీలు బొమ్మలు అవ్వడమే వారు చేసిన పాపం అనుకుంట! ఆ పాపమే వారికి శాపంగా మారింది! అసలు కథ ఏంటో చూడండి!

వివరాల లోకి వెలితే..హైదరాబాద్ శివార్లలోని మైలార్ దేవ్ పల్లి పరిధిలోని వినాయక్ నగర్ కు చెందిన అంజయ్య, విజయలక్ష్మి దంపతులకు యశస్విని(6), యశ్వంత్ (4) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. రెండు రోజుల క్రితం విజయలక్ష్మి పాలలో విషం కలుపుకుని తాగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను.. భర్త అంజయ్య స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వారి పిల్లలు బాదంపాలు అనుకుని.. విషం కలిపిన పాలు తాగారు.


ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఇద్దరు పిల్లలని స్థానికులు గమించి.. వారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఆసుపత్రిలో కోలుకోగా.. నీలోఫర్ లో చికిత్స పొందుతూ చిన్నారి యశస్విని చనిపోయింది. మరో చిన్నారి యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
చిన్నారి మృతితో ఈ సంఘటన మార్చ్ 10 న వెలుగులోకి వచ్చింది. చిన్నారి మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యాభర్తల గొడవ కారణంగానే విజయలక్ష్మీ తన ఇద్దరు పిల్లలకు పాలల్లో విషం కలిపి తాగించి తానూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు!

Comments

comments

Share this post

scroll to top