“బాహుబలి” సినిమా చూసి ఆ చిన్నారి “రాజమౌళి”ని ఏమడిగిందో తెలుసా..? అలా అడగడం కరెక్ట్ అంటారా?

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

అయితే ఈ సినిమా చూసిన తర్వాత మూడు సంవత్సరాల పాప “రాజమౌళి” ఏమడిగిందో చూడండి అని యూట్యూబ్ లో ఓ వీడియో కనిపించింది. వీడియో లో చిన్న పాప ఏమడిగింది అంటే..

“రాజమౌళి గారు నేను బాహుబలి చూసాను. సినిమా బాగుంది బాగోలేదు అని నేను చెప్పను. దేశం గర్వించదగ్గ సినిమా తీశారు. సినిమాకు చాలా డబ్బులు వచ్చాయి కదా..అందులో కొంత పేద పిల్లలకు ఇస్తే బాగుంటుంది”

ఇలా అడిగింది ఆ చిన్నారి. ఆ చిన్న పాపతో కావాలని ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించారా? అనేది కామెంట్స్ లో చర్చనీయాంశం అయ్యింది. వీడియోలో చూసినట్లయితే ఆ పాప వెనక ఓ ఏసీ ఉంది. అంటే ఆ పాప పేద పాప కాదు అని కొందరు కామెంట్ కొట్టారు. కొందరు చిన్నారి బాగా అడిగింది అని ప్రశంసలు కూడా కురిపించారు! బాగా కష్టపడి సంపాదిస్తే డబ్బులు అడగడం ఫాషన్ అయిపొయింది అని మరికొందరు అన్నారు. మరికొందరైతే పిల్లలకు అడుక్కోవడం నేర్పకండి అన్నారు. ఇలా విభిన్నంగా స్పందించారు ఒకొక్కరు!.

Watch Video Here:

వీడియో చూసారు కదా..! మరి మీరు ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top