ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ల‌డ్డూ ఈ సారి లేన‌ట్టే. “లడ్డు స్థానంలో ఏం పెడుతున్నారో తెలుసా..? ఎందుకంటే..!

గ‌ణేష్ ఉత్స‌వాలు మ‌న దేశంలో ఎలా జ‌రుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఒక్కో ప్రాంతంలో జ‌రిగే వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌కు ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అందులో హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఉత్స‌వాలైతే ఏటా వైభవంగా సాగుతాయి. భారీ గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి పూజ‌లు చేస్తారు. కొన్ని ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఆ మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకుంటారు. చివ‌రకు నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం ఉత్సాహంగా సాగుతుంది. ఆ త‌రువాత రెండు, మూడు రోజుల‌కు ఆ గ‌ణ‌ప‌తి ప్ర‌సాద‌మైన భారీ ల‌డ్డూను అంద‌రికీ పంచి పెడ‌తారు. అయితే ఈ సారి ల‌డ్డూ ప్ర‌సాదం ఉండ‌డం లేదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఈ సారి మాత్రం అందివ్వ‌డం లేదు. ఎందుకంటే… గ‌తేడాది ల‌డ్డూ పంపిణీ వాటాలో ఉత్స‌వ క‌మిటీ స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వివాదం త‌లెత్తింది. దీంతో ఈ సారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని నిలిపివేశారు. కాగా ప్ర‌తి ఏటా ఈ గ‌ణేషుడి కోసం ల‌డ్డూను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా తాపేశ్వ‌రం నుంచి తెప్పిస్తారు. అక్క‌డే ల‌డ్డూను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలోనే 2015లో మల్లిబాబు అనే వ్య‌క్తి తాపేశ్వ‌రంలో ల‌డ్డూ చేయించి ఖైర‌తాబాద్ గ‌ణేషుడి వ‌ద్ద పెట్ట‌గా, అందులో ఆయ‌న‌కు వాటా ద‌క్క‌లేదు. కొంద‌రు ఆయ‌న వాటాను దౌర్జ‌న్యంగా తీసుకున్నారు.

ఆ త‌రువాత 2016లో ల‌డ్డూను తేవ‌ద్ద‌ని కొంద‌రు ఉత్సవ క‌మిటీ స‌భ్యులు మ‌ల్లిబాబుకు చెప్పారు. అయినా అత‌ను విన‌కుండా మ‌ళ్లీ ల‌డ్డూను తెప్పించాడు. అయితే అప్పుడు తెచ్చిన 500 కిలోల ల‌డ్డూలో కూడా అత‌నికి వాటా ల‌భించ‌లేదు. దీంతో మ‌ల్లిబాబు తీవ్ర మ‌న‌స్థాపానికి లోన‌య్యార‌ట‌. కాగా ఈ ఏడాది ఉత్స‌వ క‌మిటీ అత‌న్ని సంప్ర‌దించ‌లేద‌ని తెలిసింది. దీంతో ఈ సారి ఖైర‌తాబాద్ గ‌ణేషుడికి ల‌డ్డూను పెట్ట‌డం లేదు. ఫ‌లితంగా భ‌క్తుల‌కు ల‌డ్డూ ప్ర‌సాదం ల‌భించ‌డం లేదు. అయితే ల‌డ్డూ లేక‌పోతే ఎలా అని భావించిన ఉత్స‌వ కమిటీ స‌భ్యులు అచ్చం ఆ ల‌డ్డూలానే ఉండే ప్లాస్ట‌ర్ ప్యారిస్‌తో చేసిన మోడ‌ల్ లడ్డూను గ‌ణ‌ప‌తి వ‌ద్ద పెట్టునున్నారు. శిల్పి రాజేంద్ర‌న్ ఆ ల‌డ్డూను తీర్చిదిద్దుతున్నాడు. అంటే.. త్వ‌ర‌లో జ‌రిగే వినాయ‌క చ‌వితి రోజున ప్ర‌తిష్టించ‌బోయే ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి వ‌ద్ద పెట్ట‌బోయేది బొమ్మ ల‌డ్డూ అన్న‌మాట‌. హ‌త‌విధీ..!

Comments

comments

Share this post

scroll to top