ఖైరతాబాద్ వినాయక లడ్డు పంపీణి వాయిదా.. అక్టోబర్ 2 న పంపకం.

11 రోజులు పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ గణనాధుడి చేతిలోని లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈరోజు లడ్డూ పంపిణీ కార్యక్రమం ఉన్నప్పటికీ… భద్రతా కారణాల రీత్యా దీనిని వాయిదా వేశారు.ఆరువేల కిలోల లడ్డూ పంపిణీ సంధర్భంగా భారీ బందోబస్త్ అవసరం. లడ్డూ కోసం భక్తలు ఎగబడతారు  వారిని అదుపు చేయడానికి పోలీసులు అవసరం, కానీ ప్రస్తుతం పోలీసులు అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో బిజీగా ఉన్నారు.

వీటన్నింటి దృష్టిలో ఉంచుకున్న నిర్వాహకులు అక్టోబర్ 2 న ఈ లడ్డూ  పంపిణి ఉంటుందని తెలిపారు నిర్వాహకులు. లడ్డూను పూర్తిగా కవర్ తో కప్పి ఉంచడం ద్వారా గాలి ఆడక చెడిపోతోందని , వీలైనంత త్వరగా పంచాలని లడ్డూ దాత మల్లిబాబు అంటున్నారు. ఈ రోజు పంపిణీ కార్యక్రమం ఉందనుకొని భక్తులు ఎవ్వరూ రావద్దని నిర్వాహకులు తెలిపారు.

 

HY12LADDU_1_2103187f

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top