ముసుగు వేయొద్దు మనసు మీద..వలలు వేయొద్దు వయసు మీద..ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫానూ వేగాలతో…అంటూ కుర్రకారు మనసుదోచిన కిమ్ శర్మ ..తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కనిపించి మాయమైంది..హిందీలో అడపాదడపా నటించినప్పటికీ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన కిమ్ శర్మ..ఇప్పుడు ఏం చేస్తుంది..తెరపైకి ఏవిధంగా రంగ ప్రవేశం చేయనుందో తెలుసా…?
ముంబైలో ఒక పర్యటనలో భాగంగా క్లోజప్ టూత్ పేస్టు యాడ్ కోసం ఎంపికైన కిమ్ శర్మ .. తర్వాత ఆమె సన్ సిల్క్, పెప్సి, టాటా సఫారి, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్-ఎన్-క్లియర్ మరియు లిరిల్ ప్రకటనలలో నటించింది. ఆదిత్య చోప్రా సహకారంతో తొలిసారిగా మొహబతీన్ చిత్రంలో నటించింది…బాలివుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కి కిమ్ శర్మ కజిన్ అవుతుంది..
హిందీలో చిత్రాలు చేస్తూ తెలుగులో కూడా మెరిసింది..మగధీర సినిమాలో రాంచరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నటించింది కిమ్..సినిమాలకంటే ఎక్కువగా యువరాజ్ సింగ్ తో ఉన్న ఎఫైర్ మూలంగా వార్తల్లో నిలిచిందే ఎక్కువ..యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం బ్రేక్ అప్ అయిన తర్వాత కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పంజనీని 2010లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది…ఇప్పుడు మళ్లీ ఒక పెద్ద టీవి షో ద్వారా ప్రేక్షకులకు ముందుకు రానుంది…వెండితెరపై మెరిసిన ఈ తార బుల్లితెర ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి..