కార్తీ, రకుల్ జంటగా నటించిన “ఖాకీ” హిట్టా.? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): ఖాకీ (Khaakee)

Cast & Crew:

 • నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, జమీల్ ఖాన్ తదితరులు
 • సంగీతం: ఘిబ్రన్
 • నిర్మాత: ఉమేష్ గుప్త
 • దర్శకత్వం: హెచ్.వినోద్

Story:

1995 లో చెన్నైలో జరిగిన ఓ దోపిడీ సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. 1999 లో పోలీస్ ఆఫీసర్ గా కార్తీ తెరమీద పరిచయమవుతారు. కార్తీ వాళ్ళ పక్కింటి అమ్మాయిగా రకుల్ ప్రీత్ పరిచయమవుతుంది. ట్యూషన్లు చెప్తూ ఉంటుంది హీరోయిన్. dsp గా ప్రమోట్ అవుతాడు కార్తీ. అన్యాయాలపై అతను విరుచుకుపడడంతో అనేక స్టేషన్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. డెకాయిట్ గ్యాంగ్ చేసే నెరపాలపై దృష్టి పెడతాడు కార్తీ. ఇంతలో రకుల్ తో లవ్ లో పడతాడు. చివరికి డెకాయిట్ గ్యాంగ్ ను ఎలా అంతం చేసాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!

Review:

‘ఊపిరి’ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను కార్తీ సంపాదించుకున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ సినిమా. నాగార్జునతో కలసి చేసిన సినిమా. ఇప్పుడు సోలోగా ‘ఖాకీ’ అంటూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వచ్చాడు. 1995 నుంచి 2005 మధ్య జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన కొంత మంది పోలీస్ అధికారుల వాస్తవ కథలను మిక్స్ చేసి మనకు అందిస్తున్నారు దర్శకుడు హెచ్.వినోద్. క్రిమినల్స్‌ను పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో ‘ఖాకీ’ని నిర్మించారు. సినిమా వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి పాత్రలో కార్తీ కనిపిస్తాడు. రకుల్, కార్తీ కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కొన్ని స్టెంట్స్ బాగున్నాయి. పాటలు అంతగా ఆకట్టుకోకపోయిన..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది.

Plus Points:

 • స్టెంట్స్
 • కార్తీ-రకుల్ కెమిస్ట్రీ
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • కార్తీ యాక్టింగ్

Minus Points:

 • సాగదీసే స్క్రీన్ ప్లే
 • ఇంటర్వెల్ సీన్
 • రొటీన్ స్టోరీ
 • సాంగ్స్

Final Verdict:

1995 – 2005 మధ్యలో జరిగిన కొన్ని క్రైమ్ సీన్స్ అన్ని కలిపి తెరకెక్కిస్తే “ఖాకీ” సినిమా.

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top