ఎం సినిమా రా బాబు… ఆ మూవీ పై కేటీఆర్ ట్వీట్ అదిరింది..!!

కేజీఎఫ్ అదిరిపోయింది: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెగ్యులర్ గా సినిమా వాళ్లతో టచ్ లో ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూసి వాటిపై ట్విట్టర్ లో స్పందిస్తారు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ ను కేటీఆర్ తాజాగా చూసారట. సినిమా చూసిన వెంటనే తన రివ్యూను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 

కేటీఆర్ ట్వీట్…

‘కొద్దిగా ఆలస్యంగానైనా ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చూశా. వాట్ ఏ మూవీ. టెక్నికల్ గా అద్భుతంగా ఉంది. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయింది’

కేజీఎఫ్ చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా కేజీఎఫ్. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ్, హిందీలో కూడా విడుదలై రూ. 230 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టింది.

కేజీఎఫ్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఇప్పడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. చకా చకా షూటింగ్ జరుపుకుంటున్న కేజీఎఫ్ పార్ట్ 2 2019 చివరిలో విడుదల కానుంది.

కన్నడ సినీ చరిత్రలో ఓ సంచలనం

‘కెజిఎఫ్’ చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. కన్నడనాట రూ. 100 కోట్ల వసూళ్లు దాటిన తొలి సినిమా ఇది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లకుపైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

 

Comments

comments

Share this post

scroll to top