కేటీఆర్ కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన పిల్లాడు.. చూస్తే మీరు షాక్ అవుతారు..!

Siva Ram

సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉంటారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తాను పాల్గొనే కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలే కాకుండా అప్పుడప్పుడు పలు ఆసక్తికర సంఘటనలు కూడా ట్వీట్ చేస్తుంటారు.. తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు. ఇది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.


‘జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు చెప్పారు.? ఈ కిడ్ చాలా స్మార్ట్ . టీచర్ కూడా అంతే స్మార్ట్ గా కనిపిస్తున్నారు’ అని రాసి కింద వారి హోంవర్క్ ఫొటోలను షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
కేటీఆర్ తాజాగా చేసిన ఓ ట్వీట్.. ఓ టీచర్ తన స్టూడెంట్ కు ఫజిల్ గా ఇచ్చింది. ‘ఆకలితో ఉన్న పిల్లి పాలు తాగడానికి దారి చూపండి’ అంటూ టీచర్ ఓ ఫజిల్ ను విద్యార్థికి ఇచ్చింది.. దానికి అతను ఇచ్చిన సమాధానాన్ని చూసి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టారు. ఇప్పుడది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. .

టీచర్ ఇచ్చిన ఆ ఫజిల్ ను తప్పుగా అర్థం చేసుకున్న విద్యార్థి తనదైన శైలిలో పక్కదారిలో పిల్లి వెళ్లి పాలు తాగుతున్నట్లుగా గుర్తిస్తూ సమాధానం ఇచ్చాడు. దానికి టీచర్ కూడా తప్పు అని చెప్పకుండా రైట్ వేసింది. ఇది వారం రోజుల క్రితం జరిగినట్టుగా తేదిని బట్టి అర్థమవుతోంది.


కేటీఆర్ తాజా పోస్టు యువతకు మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా ఆవేశాలకు పోయి ఆత్మహత్యలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారికి చెంపపెట్టులా ఉంది. ఈ ప్రపంచంలో అన్ని ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. అలాగే అన్ని చిక్కుమడులకు కూడా ఏదో ఏదో దారి ఉంటుంది.


ఆ దారిని వెతుక్కుంటూ వెళితేనే మన గమ్యం చేరగలం. అది మంచి దారా.. చెడ్డ దారా అన్నది కాకుండా ఆలోచించే తీరును బట్టే విజయం ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ను ఆ పిల్లాడు ఎంత బాగా చెప్పాడనేదే కేటీఆర్ ట్వీట్ సారాంశం. కేటీఆర్ కు ఎంతగానో ఆకట్టుకున్న ఆ సరాదా ట్వీట్ చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు.

Comments

comments