కొచ్చి మెట్రో రైల్‌ వ‌ర్క‌ర్ల‌కు విందు భోజ‌నం పెట్టిన అధికారులు. ఎందుకో తెలుసా..?

నిజంగా అస‌లైన థ్యాంక్స్ గివింగ్ అంటే ఇదే..! అవును. వారు రోజు వారీ ప‌నిచేసే కార్మికులే. ప‌నికి త‌గ్గ జీతం చెల్లించి ప‌ని చేయించుకుంటే చాలు. ఎవ‌రైనా అంత‌కు మించి చేయాల్సిన ప‌నిలేదు. కానీ… అలా క‌ష్ట‌ప‌డిన కార్మికుల శ్ర‌మ‌ను గుర్తించి ఏదో ఒక వేడుక ఏర్పాటు చేస్తే అది వారికిచ్చే నిజ‌మైన థ్యాంక్స్ గివింగ్ అవుతుంది. అదే ప‌ని కేర‌ళ మెట్రో రైల్ అధికారులు చేశారు. ఈ నెల 17వ తేదీన కేర‌ళ‌లోని కొచ్చిలో మెట్రో రైల్ సేవ‌లు ప్రారంభం అయ్యాయి. ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా వాటిని ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు మెట్రో రైల్ ప్రాజెక్టులో నిత్యం రాత్ర‌న‌క‌, ప‌గ‌ల‌న‌క ప‌నిచేసిన వ‌ర్క‌ర్ల‌కు స‌ద‌రు మెట్రో రైల్ అధికారులు మంచి విందు భోజ‌నం పెట్టించారు. ఆ విధంగా ఆ కార్మికులు ప‌డిన శ్ర‌మకు ఆ అధికారులు మ‌ర్యాద పూర్వ‌కంగా థ్యాంక్స్ చెప్పారు.

కొచ్చిలో కేర‌ళ మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్‌) ఆధ్వ‌ర్యంలో చాలా సంవ‌త్స‌రాల నుంచి మెట్రో ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆ ప‌నుల్లో దాదాపుగా 600కు పైగా కార్మికులు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. రాత్ర‌న‌క‌, ప‌గ‌ల‌న‌క వారు క‌ష్ట‌పడ్డారు. ఒక్కో వ‌ర్క‌ర్ రోజుకు రూ.400 జీతానికి 12 గంట‌ల పాటు ప‌నిచేసేవారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే కొచ్చిలో మెట్రో రైల్ నిర్మాణం పూర్త‌యింది. దీంతో ఈ నెల 17వ తేదీన మోడీ దాన్ని ప్రారంభించారు. అయితే ఈ నెల 12వ తేదీన కేర‌ళ మెట్రో రైల్ అధికారులు స‌ద‌రు 600 మంది కార్మికులకు మంచి విందు భోజ‌నం ఏర్పాటు చేశారు. 9 ర‌కాల కూర‌లు, ప‌లు రైస్ ఐట‌మ్స్‌, స్వీట్లు ఆ భోజ‌నంలో పెట్టారు.

ఇక విందు భోజ‌నం త‌రువాత మ్యూజిక్‌, డ్యాన్స్, పాట‌లు పాడ‌డం వంటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసి కార్మికుల‌ను ఉల్లాస‌ప‌రిచారు. ఈ కార్యక్రమంలో ఆ మెట్రో రైల్ అధికారులు కూడా పాల్గొన‌డం విశేషం. సాధార‌ణంగా ఎవ‌రూ కూడా ప‌నిచేసిన కార్మికుల కోసం ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌ర‌ని, కేర‌ళ మెట్రో రైల్ అధికారులు ఇలాంటి ప్రోగ్రామ్‌లు పెట్ట‌డం వ‌ల్ల త‌మ‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని ఆ కార్మికులు కూడా అంటున్నారు. ఈ క్ర‌మంలో వారు విందు భోజ‌నం ఏర్పాటు చేసిన ప్రాంతం వ‌ద్ద పెద్ద గోడ‌పై అంటించిన పేప‌ర్ల‌పై త‌మ సంత‌కాల‌ను, సందేశాల‌ను రాశారు. ఏది ఏమైనా కార్మికుల కోసం ఇలాంటి కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన కేర‌ళ మెట్రో రైల్ అధికారుల‌ను మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top