కేర‌ళ‌కు త‌ల‌మానికం – దేశానికే ఆద‌ర్శం – కుటుంబ‌శ్రీ స్ఫూర్తిదాయ‌కం

తుపాన్లు త‌ల్ల‌డిల్లేలా చేసినా కేర‌ళ త‌న అస్తిత్వాన్ని కోల్పోలేదు. ప్ర‌కృతి ప్ర‌కోపానికి గూళ్లు చెదిరినా.గుండెల్లో ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకుని అక్క‌డి జ‌నం మొక్క‌ల్లా నిల‌బ‌డ్డారు. త‌మ‌ను తాము పోగేసుకుని.పొదివి ప‌ట్టుకుని నిల‌బడ్డారు. వీరి న‌మ్మ‌కం ముందు.వీరి ఐక్య‌త ముందు కాలం లొంగి పోయింది. అంతిమంగా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డ‌ట‌మే కాదు ఆ రాష్టానికి త‌ల‌మానికంగా నిలిచారు. అద్బుత‌మైన పాఠంగా దేశం ముందు నిల‌బ‌డ్డారు. ఇదో అద్భుత‌మైన విజ‌యంతో కూడిన క‌థ‌. మ‌హిళ‌లు క‌లిసి మూకుమ్మ‌డిగా గెలుపు వాకిట నిలిచిన గాథ ఇది. దానిపే కుటుంబ‌శ్రీ‌. స‌హ‌కార వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తిరూపంగా నిలిచింది. చేయ‌ని ప‌నంటూ లేదు. ఒక‌నాడు వంద‌ల రూపాయ‌ల‌తో మొద‌లైన ఈ వ్య‌వ‌స్థ ఇపుడు కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ ను సాధించి ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

kutumbashree

బంగ్లాదేశ్ లో రూపాయి పొదుపు ల‌క్ష‌లాది కుటుంబాల‌ను మార్చేసింది. వాళ్ల బ‌తుకుల్లో వెలుగులు నింపింది. ఆ ఉద్య‌మం ప్ర‌పంచానికి పాకింది. కేవ‌లం ఒక్క రూపాయి అని మనం తీసి పారేస్తాం .కానీ ల‌క్ష‌లాది జ‌నం ఆ ఒక్క రూపాయినే న‌మ్ముకున్నారు. త‌మ‌ను తాము దిద్దుకున్నారు. ఒక్క‌రిగా మొద‌లైన ఈ ప్ర‌స్థానం ఇపుడు లక్ష‌లాది మందికి చేరుకుంది. ఈ చైత‌న్యం దేశానికి చోద‌క‌శ‌క్తిని క‌లుగ చేస్తోంది. ఏ ఒక్క‌రు ప‌ని కోసం నిరీక్షించ‌రు. త‌మ‌కు తోచిన ప‌నినే శ్ర‌ద్ద‌గా చేస్తారు. విద్య‌, ఆరోగ్యం, ఉపాధి.పొదుపు .నిరంత‌ర శిక్ష‌ణ‌.వ్య‌వ‌సాయం.వీటిపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌రుకుల‌న్నింటిని ఎలాంటి మందులు ఉప‌యోగించకుండానే స‌ర‌ఫ‌రా చేస్తారు.

ప్ర‌తి మ‌హిళ కుటుంబం స్వ‌యం సమృద్ధిని సాధించేలా కుటుంబ‌శ్రీ తీర్చిదిద్దింది. ఒక‌రైతే ఏం చేయ‌లేం. అదే ప‌ది మంది క‌లిస్తే అద్బుత బ‌లం తోడ‌వుతుంది. దేనినైనా సాధించ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. ఇదే ప్రాథ‌మిక సూత్రం. ఉన్న చోట‌నే ఉపాధి. పొదుపు చేస్తారు. ప‌ని క‌ల్పిస్తారు. రుణాలు ఇస్తారు. తిరిగి వ‌సూలు చేస్తారు. బ‌త‌క‌డానికి కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూరుస్తారు. పాఠ‌శాల‌ల‌ను వారే నిర్వహిస్తారు. పాఠాలు వాళ్లే చెబుతారు.లెక్క‌లు వారే రాసుకుంటారు. ఏకంగా ఓ బ్యాంకునే నిర్వ‌హించే స్థాయికి ఎదిగారు. ఇదంతా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం వ‌ల్ల వ‌చ్చిందేనంటారు.

ఒక‌రా ఇద్దరా ఇపుడు కుటుంబ‌శ్రీ కేర‌ళ‌కే కాదు దేశం గ‌ర్వించే స్థాయికి తీసుకు వ‌చ్చారు ఆ మ‌హిళ‌లు. మ‌హిళా సాధికార‌త అంటే ఏమిటో.మ‌హిళ‌ల శ‌క్తి సామ‌ర్త్యాలు ఎలా ఉంటాయో తెలుసు కోవాలంటే కేర‌ళ‌ను సంద‌ర్శించాల్సిందే. వాళ్లు రైతుల‌ను ఆదుకున్నారు. ప్ర‌కృతి విధ్వంసం నుంచి గ‌ట్టెక్కారు. తుపాను బీభ‌త్సాన్ని ఎదుర్కొన్నారు. ప్ర‌తి చోటా వాళ్లే. అందుకే కుటుంబ శ్రీ లో స‌భ్య‌త్వం పొంద‌డ‌మంటే .ఓ ప్ర‌జాప్ర‌తినిధి కంటే ఎక్కువ గౌర‌వం. త‌మ‌ను తాము తీర్చిదిద్దుకున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్ చేసుకున్నారు. ఎన్ ఎస్ డీసీ ద్వారా 50 వేల మందికి పైగా వివిధ రంగాల‌లో శిక్ష‌ణ ఇచ్చారు.

1,74 ,000 కుటుంబాలు కుటుంబ‌శ్రీ‌లో ఉన్నాయి. 82 వేల 487 మందికి ఇళ్లు క‌ట్టించారు. 2 లక్ష‌ల‌కు పైగా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు ఉన్నాయి. 71 వేల 200 మందికి స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ శిక్ష‌ణ ఇచ్చారు. 3 లక్ష‌ల 47 వేల మందికి పైగా రైతుల‌కు ల‌బ్ధి క‌లిగేలా చేశారు. 16 రాష్ట్రాల‌కు విస్త‌రించింది. 26 వేల 295 వ్యాపారాల‌కు సాయం అందించారు. 9 వేల 433 కుటుంబాలు బాగుప‌డ్డాయి. మ‌హిళ‌లు స్వ‌యం స‌మృద్ధిని సాధించేలా వ్యాపారాలు చేప‌ట్టేందుకు శిక్ష‌ణ‌తో పాటు ఆర్థిక సాయం అంద‌జేస్తోంది కుటుంబ‌శ్రీ‌. 8 కోట్ల‌కు పైగా ఆదాయాన్ని గ‌డించింది. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అన్న సామెత‌ను వీరు నిజం చేస్తున్నారు. 5 ల‌క్ష‌ల మిలియ‌న్ ప్ర‌జ‌ల‌ను మార్చేశారు. కేర‌ళ మ‌హిళ‌లు అక్ష‌రాస్యులే కాదు బ‌తుకుల్ని జ‌యించిన విజేత‌లు కూడా.

Comments

comments

Share this post

scroll to top