ఆఫీస్ కు లేట్ గా వ‌చ్చినందుకు…త‌న‌కు తానే షో కాజ్ నోటీస్ ఇచ్చుకున్న IAS ఆఫీస‌ర్.!

ఆఫీస్ కు లేట్ గా వ‌చ్చినందుకు గాను..ఓ IAS ఆఫీస‌ర్ త‌న‌కు తానే షోకాజ్ నోటీస్ స‌ర్వ్ చేసుకున్నాడు.! జ‌న‌వ‌రి 1 నుండి కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం శాల‌రీ-పంచింగ్ సిస్ట‌మ్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ప్ర‌కారం ప్ర‌తి గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ లో పంచింగ్ మెషిన్ ఉంటుంది.. డ్యూటీకి రాగానే ప్ర‌తి ఉద్యోగి విధిగా త‌మ‌కు ముందుగానే ఇచ్చిన కార్డ్ ద్వారా స్వైప్ చేయాలి, అలాగే ఆఫీస్ అయ్యాక ఇంటికెళ్ళే ముందు కూడా స్వైప్ చేసి వెళ్ళాలి…దీని ద్వారా స‌ద‌రు ఉద్యోగి ఇన్ – అవుట్ టైమింగ్స్ తెలిసిపోతాయి… 2 సార్లకు మించి లేట్ అయితే…దానిని గైర్హాజ‌రుగా ప‌రిగ‌ణించి…శాల‌రీ క‌టింగ్ ఉంటుంది.!

అయితే కేర‌ళ రాష్ట్ర జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ గా ఉన్న బిస్వాల్ సిన్హా… ఫ్రిబ్ర‌వ‌రి 1,2 వ తేదీల‌లో ఆఫీస్ కు 1 గంట లేటుగా వ‌చ్చారు.! న‌మోదైన టైమింగ్స్ ప్ర‌కారం లేట్ గా వ‌చ్చిన సెక్రెటేరియ‌ట్ ఉద్యోగులంద‌రికీ తానే నోటీసులు ఇవ్వాలి…సో…అంద‌రితో పాటు త‌నకు కూడా షో కాజ్ నోటీసును జారీ చేసుకున్నారు ఈ IAS ఆఫీస‌ర్ .! అంతేకాదు..లేట్ ఎందుక‌య్యింది అనే దానికి త‌న‌కు తానే వివ‌ర‌ణ ప‌త్రం సైతం ఇచ్చుకున్నాడు బిస్వాల్ సిన్హా.! ఇక మీదెప్పుడూ ఇలా జ‌ర‌గ‌ద‌నే హామీ కూడా ఇచ్చుకున్నారీ IAS ఆఫీస‌ర్.!

రూల్ ఈస్ రూల్., రూల్ ఫ‌ర్ ఆల్ అని … త‌న‌ను తాను ఫ‌స్ట్ క‌రెక్ట్ చేసుకున్న IAS ఆఫీస‌ర్ గారిని అభినందిద్దాం..

Comments

comments

Share this post

scroll to top