కేరళ అమ్మాయిల అందం వెనకున్న ఈ 10 సీక్రెట్స్ మీకు తెలుసా..? తప్పక ట్రై చేయాలి అనుకుంటారు.!

మళయాలిలు చక్కని దేహ కాంతితో, ఒత్తయిన జుట్టుతో చూడడానికి ఎంతో ఆకర్షణగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటారు కదా. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? వారు కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే..అంతేకాదు మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేరళ రాష్ట్రంలో గుండె పోటు జబ్బులు కూడా తక్కువే.పామాయిల్,రిఫైండ్ ఆయిల్ అంటూ అనేక రకాల నూనెలు,అనేక రకాల బ్రాండ్ల కంపెనిల నూనెలు మనకు అందుబాటులో ఉన్నాయి.అయితే వాటన్నింటితో పోల్చితే కొబ్బరినూనె ఎంతో మేలట.. కొబ్బరి నూనె వలన కలిగే లాభాలేంటో తెలుసుకోండి…

 • సహజ సంతృప్త ఆమ్లాలు కొబ్బరి నూనె ద్వారా పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో మంచి కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తే ఏకైక ఆయిల్. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి.
 • అలాగే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్, రక్త పోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది. కొబ్బరి నూనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది.
 • ఇందులో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ తదితర ఇతర హానికారక శిలీంధ్రాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కొబ్బరినూనె వాడకంతో అనేక అంటు వ్యాధులను ఈజీగా తరిమికొట్టొచ్చు.
 • కొబ్బరి నూనె మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.
 • జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణకోశంలో ఉన్న ఆమ్లాలను క్రమబద్ధీకరిస్తుంది.
 • కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్స్ మహిళల్లో హార్మోన్లలో సమతౌల్యాన్ని ఏర్పర్చి దానిని సరైన స్థాయిలో కొనసాగేందుకు సహాయ పడుతుంది. అంతేకాకుండా మహిళల్లో థైరాయిడ్,ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేసేలా సహాయపడుతుంది.
 • మన శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి కొబ్బరినూనె సహాయపడుతుంది. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయ (లివర్) సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి.
 • మూత్ర పిండాల్లో ఉన్న రాళ్లను, పిత్తాశయంలో ఎదురయ్యే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరినూనె వంటల్లో వాడితే దంతక్షయాన్ని నివారిస్తుంది.
 • మెదడు కణాలకు సరైన పోషకాలతో పాటుగా శక్తిని అందించి అల్జీమర్స్ బారి నుండి కాపాడుతుంది. శరీర కండరాలను బలోపేతం చేస్తుంది.
 • అలాగే క్యాన్సర్ కణితులను ప్రేరేపించే కణాలను నాశనం చేసే శక్తి కొబ్బరినూనెకు ఉంది. నిత్యం కూరల్లో కొబ్బరి నూనె మాత్రమే వాడితే శారీరక శక్తి బాగా పెరుగుతుంది.
 • శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. దేహ కాంతిని పెంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ప్రసాదిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top