ఆ కూలీకి… రైల్వే Free Wi-Fi ఉద్యోగాన్ని తెచ్చి పెట్టింది.!

అత‌ను రైల్వే స్టేష‌న్ లో కూలీ…. ఆ స్టేష‌న్ కు ట్రైన్ రాగానే ల‌గేజ్ దించ‌డం లేదా ఎక్కించడం …అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తో కుటుంబాన్ని పోషించ‌డం., ఇది అంద‌రికీ తెల్సిన అత‌ని దిన‌చ‌ర్య‌.! కానీ అత‌నిలో ఓ బ‌ల‌మైన కోరిక ఉంది. ఆ కోరిక‌ను నిజం చేసుకోవ‌డం కోసం అనేక క‌ష్టాల‌కోర్చి చివ‌ర‌కు స‌క్సెస్ ను సాధించాడు .అందుకే ఈ రోజు ఎంద‌రికో ఆద‌ర్శమ‌య్యాడు. అత‌ని గురించి క్లుప్తంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాను.

అత‌ని పేరు శ్రీనాథ్ , వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలు…కేర‌ళ‌లోని ఏర్నాకులంలో రైల్వే కూలీగా ప‌నిచేస్తున్నాడు. ట్రైన్స్ కోసం ఎదురుచూస్తూనే ఆ గ్యాప్ లో ఆ రైల్వే స్టేష‌న్ లో ఉన్న Free Wi-Fi చాలా ఉప‌యోగ‌క‌రంగా వాడుకునే వాడు… ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కొని స‌బ్జెక్ట్ ఎక్స్ ప‌ర్ట్స్ చెప్పే పాటాల‌ను వినేవాడు. త‌నకు కావాల్సిన బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకునేవాడు….ఇలా ఎప్పుడూ ఆ స్మార్ట్ ఫోన్ తోనే గ‌డిపేవాడు..మళ్లీ ట్రైన్ రాగానే సెల్ జేబులో పెట్టుకొని…కూలీ అవ‌తార‌మెత్తేవాడు.!

అలా…..రెండు సంవ‌త్స‌రాల పాటు కఠోర శ్ర‌మ చేసిన శ్రీనాథ్.. చివ‌ర‌కు కేర‌ళ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ లో ఉద్యోగాన్ని సాధించాడు. దీని కోసం అత‌ను ఏ కోచింగ్ సెంట‌ర్ వెళ్ల‌లేదు.. ఓ స్మార్ట్ ఫోన్, రైల్వే స్టేష‌న్ Free Wi-Fi, సాధించాల‌న్న క‌సి…ఈ మూడింటిని ముడిస‌రుకుగా పెట్టి అత‌ని క‌ల‌ను సాకారం చేసుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top