“కీర్తి” కి విడాకులు ఎందుకిచ్చాడో అసలు కారణం చెప్పిన “సుమంత్”..! ఏ.ఎన్.ఆర్ మరణించిన తర్వాత..!

‘మళ్లీ రావా’ అంటూ వ‌చ్చిన‌ హీరో సుమంత్ ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఓ హిట్ అందుకున్నాడు. విజ‌యోత్సాహంలో ఉన్న సుమంత్ త‌న తదుపరి చిత్రం కోసం క‌థ‌లు వినే ప‌నిలో ఉన్నారు. అయితే, ఆయ‌న తొలిసారిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆయ‌న మాజీ స‌తీమ‌ణి, న‌టి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవ‌డం వెనుక గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు. 2004లో పెళ్లి చేసుకున్న‌ సుమంత్‌, కీర్తిరెడ్డి ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. అయితే, సుమంత్ ఈ విష‌యంపై మాట్లాడ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డేవారు కాదు.

దీనిపై ఆయ‌న మాట్లాడుతూ.. ఒక‌రినొక‌రు ఇష్డ‌ప‌డే పెళ్లి చేసుకున్నాం. కానీ, పెళ్లి త‌ర్వాత మా అభిప్రాయాలు వేర‌ని అర్థమైంది. అందుకే, ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోయాం. అయితే, కీర్తి ఇప్ప‌టికీ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడ‌ప్పుడు ఫోన్ చేసి యోగ‌క్షేమాలు తెలుసుకుంటాను. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కావ‌డం నాకు సంతోషంగా అనిపించింది. మా తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆమెను క‌ల‌వ‌లేదు. అదే చివ‌రిసారి అని సుమంత్ తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top