సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కీర్తిసురేష్ చిన్ననాటి ఫోటో..తనతో పాటు ఉన్నదెవరో తెలుసా..

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి సురేష్.రామ్ హీరోగా నటించిన ఆ సినిమాతో కీర్తి కి మంచి మార్కులే పడ్డాయి.ఆ తరవాత నేను లోకల్ సినిమాలో నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది..ఆ సినిమా కూడా హిట్ అయింది..ఇప్పడు మహానటి సావిత్రి బయోపిక్ లో ప్రధాన పాత్రపోషిస్తున్న కీర్తి సురేశ్.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే మంచి ఛాన్స్ కొట్టేసింది.ఎందరో స్టార్ హీరోయిన్స్ ని కాదని కీర్తిని వరించింది మహానటి  పాత్ర..అంతేకాదు పవన్ సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది..

2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది కీర్తి.ఆ తర్వాత  ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చి మంచి పాత్రలతో దూసుకుపోతుంది.ఇప్పుడు తెలుగు,తమిళం,మళయాళం మూడు భాషల్లో నటిస్తుంది.కీర్తీ  తల్లి దండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. కీర్తికి రేవతి సురేశ్ అనే అక్క ఉంది.తను విఎఫ్ ఎక్స్ స్పెషలిస్ట్,షారుక్ ఖాన్ రెడ్ చిల్లిస్ లో వర్క్ చేసింది రేవతి.ఇటీవల కీర్తి సురేశ్ ది చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..కీర్తిని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి…ఈ ఫోటోలో కీర్తితో పాటు ఉన్నది వాళ్ల అక్క రేవతి..

 

Comments

comments

Share this post

scroll to top