జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించ‌డంపై స్పందించిన కీర్తి సురేష్.. ఆమె ఏమ‌న్న‌దో తెలుసా..?

Siva Ram

మ‌న దేశంలో ఇప్పుడు ఆయా భాషల‌కు చెందిన సినిమా ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌లా హ‌వా కొన‌సాగుతోంది. బ‌యోపిక్‌ల‌కు జ‌నాల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తీసేందుకు చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి చిత్రానికి కూడా అన్ని వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌నే వ‌స్తోంది. ఈ చిత్రాన్ని అనేక మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించింద‌ని కితాబిస్తున్నారు.

అయితే అలా కీర్తి సురేష్ కు మంచి మార్కులు రావ‌డం ఏమో గానీ ఇక ఆమె త్వ‌ర‌లో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, న‌టి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లోనూ న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ వార్త‌ల ప‌ట్ల కీర్తి సురేష్ కూడా స్పందించింది. ఆమె ఈ విష‌యంపై ఏం చెప్పిందంటే.. తాను జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించ‌డం లేద‌ని చెప్పింది. అస‌లు ఆ బ‌యోపిక్‌కు సంబంధించి త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని, ఒక వేళ ఎవ‌రైనా సంప్ర‌దిస్తే అప్పుడు చూస్తాన‌ని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

కాగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌పై గ‌త కొన్నాళ్లుగా ఈ రూమ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో వాటిని కీర్తి సురేష్ తాజాగా ఖండించింది. దీంతో ఆ విష‌యం వ‌ట్టిదేన‌ని తేలిపోయింది. మ‌రి నిజంగా ఆమె వ‌ద్ద‌కు జ‌య‌ల‌లిత బయోపిక్‌లో న‌టించాల‌ని చెప్పి ఎవ‌రైనా ఆఫ‌ర్ ఇస్తూ వ‌స్తే అందుకు ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో హీరోయిన్ త్రిష‌ను ప్ర‌ధాన పాత్ర‌లో తీసుకోవాల‌ని గ‌తంలో అనుకున్నార‌ట‌. కానీ త‌రువాత ఏమైందో తెలియ‌దు కానీ త్రిష‌కు బ‌దులుగా కొంత కాలం న‌య‌న‌తార పేరు వినిపించింది. ఆ త‌రువాత తెర‌పైకి ల‌క్ష్మీ రాయ్ పేరు కూడా వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పేరు వ‌చ్చింది. అయినా ఆ విష‌యాన్ని ఆమె ఖండించింది క‌దా. మ‌రి ఈ విష‌యంపై త‌దుపరి అప్‌డేట్ ఏముంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

 

Comments

comments