“మహానటి” సినిమాలో నటించడానికి “కీర్తి సురేష్” ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా.?

మహానటి..అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా..మొత్తం సినిమా అభిమానులంతా వేయి కన్నులతో ఎదురు చూస్తున్నసినిమా..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  సావిత్రి గా కీర్తి సురేష్ నటిస్తుంది..ప్రియాంక దత్,స్వప్నా దత్ సినిమాను నిర్మించారు..మహానటి పాత్రలో నటించి మెప్పించడం అంటే ఆషామాషి విషయంకాదు ఇప్పటికే సావిత్రిగా కీర్తి సురేష్ మంచి మార్కులు కొట్టేసింది.మరి ఆ పాత్రకు తనెంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?

నేను శైలజ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్,నేను లోకల్,అజ్ణాతవాసి సినిమాల్లో నటించి మరింత చేరువైంది.మూడు సినిమాల తర్వాత నాలుగో చిత్రానికే మహానటిలో సావిత్రి పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది.సావిత్రి గారి పైన సినిమా తీయడమే సాహసం..అందులో సావిత్రి పాత్రలో నటించడం అంటే చిన్న విషయం కాదు అని అభిప్రాయపడ్డారు.కీర్తి ఆ పాత్ర చేస్తుంది అనగానే పెదవివిరిచారు..కాని సినిమా ఫస్ట్ లుక్ రాగానే సావిత్రే మళ్లీ వచ్చిందా అన్నట్టుగా సంబరపడ్డారు..కీర్తి సురేశ్ లో మరో సావిత్రిని చూసుకున్నారు…వేషధారణలో  కాని,హావభావాల్లో కాని సావిత్రేమైనా పూనిందా అన్నట్టుగా అంతగా ఒదిగిపోయింది కీర్తి ఆ పాత్రలో..

సావిత్రి పాత్ర కోసం కీర్తి తీసుకున్న రెమ్యునరేషన్ కోటి యాభై లక్షలు..ఇప్పటివరకూ కీర్తి తీసుకున్న పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇదే..అంతేకాదు లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ఒక్కసారిగా కోట్లలోకి చేరి..స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది..సావిత్రిగారా మజాకా…

Comments

comments

Share this post

scroll to top