కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదైలైన మహానటి ఫస్ట్ లుక్ చూస్తే నిజంగా సావిత్రి గారే గుర్తొస్తారు.!

ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన “దేవత”లో ఆమె నటన వర్ణనాతీతం..ఆమె మహానటి సావిత్రి.. మన తెలుగు జాతి సంపద. ఈ తరం వారికి మరియు ముందు తరాలకు  లభించిన అమూల్యమైన సంపద సావిత్రి.అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’.

సావిత్రి జీవితం మొత్తం సినిమాతోనే ముడిపడింది..ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలంటే అందరు సినినటులు భాగమవుతారు..అందుకే ప్రతి పాత్ర ముఖ్యమైనదే కాబట్టి తారల ఎంపిక కూడా అంతే పకడ్బందీగా చేస్తున్నారు..సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తుండగా..సమంత కీలకపాత్రలో నటిస్తుంది..జెమినీ గణేశన్ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ చేస్తున్నారు..ఒకె బంగారం సినిమాతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ..ఇప్పుడు ఆ కాలం నటి జమున క్యారెక్టర్ కి నటిని ఎంపిక చేశారు మహానటి యూనిట్.. జమున పాత్రలో నటిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే..ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి ఎంతపెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే..సెకండ్ ఫిల్మ్ లోనే ఇంత మంచి ఛాన్స్ కొట్టేసిని షాలిని చాలా లక్కీ..

మరో హీరోయన్ పాత్రకు మాళవిక నాయర్ సెలక్ట్ అయింది..ఈమె ఎవడే సుభ్రహ్మణ్యం,కళ్యాణవైబోగమేల్లో నటించగా..మాళవిక నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ నాగ్ అశ్వినే ఈ మహానటి మూవీని తెరకెక్కిస్తున్నారు..ఇంతమంది తారలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తప్పక అలరిస్తుందనడంలో సందేహం లేదు..

కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదైలైన మహానటి ఫస్ట్ లుక్ చూస్తే నిజంగా సావిత్రి గారే గుర్తొస్తారు.!

 

Comments

comments

Share this post

scroll to top