పనిమనిషి పెళ్లికి అంతా తానై అన్ని చేసిన ముఖ్య మంత్రి.. ఎవ్వరో తెలుసా ??

ఎంతో కాలంగా తన ఇంట్లో పనిచేస్తున్న యువకుడి పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తానై ముందుండి వివాహం జరిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముణుగూరుకు చెందిన కొండేరు సతీష్ చాలాకాలంగా కేసీఆర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన శిరీషతో పెళ్లి నిశ్చయమైంది. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుమార్తె, ఎంపీ కవిత పెళ్లి పెద్దలుగా విచ్చేసి దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఈ వివాహ వేడుకకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీ న్యూస్ ఎండీ సంతోష్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొండేరు సతీశ్.. సీఎం ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ కు సమయానికి మందులు ఇచ్చే బాధ్యత కూడా ఇతనిదే. చాలాకాలంగా తమ కుటుంబంతో కలిసిపోయిన వ్యక్తి కావడంతో.. కేసీఆర్ కుటుంబం అతని వివాహాన్ని ఘనంగా జరిపించింది.

సీఎం దంపతులే పెళ్లి పెద్దలై అంతా దగ్గరుండి చూసుకున్నారు. ఎంపీ కవిత కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం 12తులాల బంగారంతో పాటు ఒక చక్కని ఫ్లాట్ ను కొత్త జంటకు అందజేశారు. ఈ గిఫ్టులకంటే పెళ్ళికూతురికి మాత్రం ముఖ్యమంత్రి గారు పెళ్లి కొడుకుని ప్రేమగా కౌగిలించుకోవడం, ఆప్యాయంగా మాట్లాడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంట! మాటల్లో వెలకట్టలేని బహుమతిగా ఆమె భావిస్తున్నారట!

Comments

comments

Share this post

scroll to top