శ్రీజ ఇంటికి వెళ్ళి, చిన్నారికిచ్చి మాట నిలుపుకున్న CM KCR, గోల్డ్ చైన్ బహూకరించిన కవిత.

బాల మేధావి.. శ్రీజ ఇంటికి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  వెళ్లారు. అద్దె ఇంట్లో ఉంటున్న శ్రీజ ఇంటికి వెళ్లి  ఓ 20 నిమిషాల పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. శ్రీజ చదువు బాద్యత అంతా తన కూతురు కవిత చూసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. ఖమ్మం లోని ఉత్తర ద్వారకా నగర్ లో  3 వ తరగతి చదువుతున్న శ్రీజ తెలంగాణ సమగ్ర చరిత్ర ను అవపోసన పట్టింది. శాతవాహనుల కాలం నుండి ప్రస్తుతం మంత్రుల పాలన వరకు ప్రతి విషయం గురించి వివరంగా చెబుతుంది.  చిన్నారి ప్రతిభ గురించి అనేక పత్రికల్లో కథనాలు రాశాయి. ఆమె ప్రతిభను తెలుసుకున్న సిఎం స్వయంగా సెక్రెటేరియట్ కు పిలిపించి….

కొన్ని ప్రశ్నలకు అడిగారు..దానికి ఆ బాల మేధావి గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పింది. కాకతీయ కాలం, శాతవాహనుల యుగం, నిజాం నవాబుల పాలన, స్వాతంత్య్రానంతర పరిస్థితి, మొదటి ఎస్‌ఆర్‌సీ, సమైక్య ఏపీ ఏర్పాటు, తెలంగాణపై వివక్షలు, ప్రత్యేక ఉద్యమం, కేసీఆర్‌ నాయకత్వంలో పోరాటాలు, కొత్త రాష్ట్రం ఏర్పాటు క్రమం,
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన, ఆయన జీవిత చరిత్ర,, మంత్రుల పేర్లు, రాష్ట్రంలో పథకాలు, సమకూలీన ఇతర అంశాలు ఇలా వీటన్నింటి గురించి వివరంగా చెప్పింది. ఆమె జ్ఞాపకశక్తి, పరిజ్ఞానానికి సీఎం అబ్బురపడ్డారు. తన వ్యక్తి గత ఖాతా నుండి రూ.10.16 లక్షల ఆర్థికసాయం అందచేశారు. ఖమ్మం వస్తే ఖచ్చితంగా మీ ఇంటికి వస్తానని హామీ కూడా ఇచ్చారు.

1327-kcr-gifts-rs-10-lakh-to-srija

అయితే నేటి నుండి ఖమ్మం జిల్లాలో TRS పార్టీ ప్లీనరీ సమావేశాలుండడంతో ఓ రోజు ముందే బయలుదేరిన కెసిఆర్ అన్నమాట ప్రకారం  శ్రీజ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో 20 నిమిషాల పాటు ముచ్చటించారు. ఈ సంధర్భంగా శ్రీజ చదువు బాధ్యతలు మొత్తం తన కూతురు కవితే చూసుకుంటుందని తెలిపారు. అక్కడే ఉన్న కవిత శ్రీజకు బంగారు చైన్ బహూకరించారు. CM తమ ఇంటికి రావడంతో శ్రీజ కటుంబం ఆనందాశ్చర్యాల్లో మునిగితేలుతుంది.

For Video Click : HERE


 

Comments

comments

Share this post

scroll to top