వాలెంటైన్స్ డే రోజు చంద్రబాబు కి గిఫ్ట్ ఇవ్వనున్న కేసీఆర్.అదేమిటో తెలుసా.??

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అస్సలు పడదు. ఎప్పుడు ఒకరినొకరు ఏదో ఒక రకంగా ధూషించుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారాలప్పుడు కేసీఆర్ ని బాగా దూషించారు, కేసీఆర్ కూడా చంద్రబాబు ని దూషించారు, కానీ ఎన్నికల తరువాత చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని కేసీఆర్ తెలిపారు. ఆ రోజు నుండి కేసీఆర్ ఎటువంటి గిఫ్ట్ ఇస్తారో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, ఒక్కోరు ఒక్కో రకంగా చెబుతున్నా, ఆ గిఫ్ట్ ఏ రకమైనదో ఎవ్వరికీ తెలియదు. ఆంధ్ర ప్రజలే చంద్రబాబు నాయుడు ని వ్యతిరేకిస్తున్నారని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఈ సారి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు.

ఆ రోజే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారు.?

ఫిబ్రవరి 14 వ తారీఖున అమరావతి లో జగన్ నూతనంగా కట్టుకున్న భవనం ఓపెనింగ్ జరగనుందని చెక్కర్లు కొడుతున్న వార్త. అయితే ఆ భవన ఓపెనింగ్ కి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని సమాచారం. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో జాయిన్ అయిన జగన్, కేటీఆర్ తో భేటీ తరువాత అధికారికంగా ప్రకటించారు. టీడీపీ పార్టీ నేతలు జగన్ ను వైసీపీ ని తిట్లతో ముంచెత్తారు, ఆంధ్రరాష్ట్రం విడిపోడానికి కారణమైన వ్యక్తులతో చేతులు కలిపిన వాళ్ళని జనాలు ఎలా నమ్ముతారు అంటూ వైకాపా మీద విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్ తో కలిసాం అని వైకాపా కార్యకర్తలు సమాధానమిచ్చారు.

అయితే ఫిబ్రవరి 14 వ తారీఖున కేసీఆర్ అమరావతి కి వెళ్తే, అక్కడ చంద్రబాబు నాయుడు గురుంచి ఏవైనా విషయాలు చెబుతారేమో అని అందరూ అనుకుంటున్నారు, ఇటీవల కేసీఆర్ వైజాగ్ కి వచ్చినప్పుడు తెలుగు ప్రజలు కేసీఆర్ కి బ్రహ్మాండమైన స్వాగతం పలికారు, కేటీఆర్ కి కూడా ఆంధ్ర రాష్ట్రం లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ జగన్ కలయిక వైసీపీ కి మంచి చేయనుందో, లేక వైసీపీ కి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందో ఎన్నికల తరువాత మాత్రమే తెలుస్తుంది. కేసీఆర్ ఏ రకమైన గిఫ్ట్ ఇస్తాడని విషయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల్లో హిట్ టాపిక్ అయ్యింది, కేసీఆర్ ఎటువంటి గిఫ్ట్ ఇచ్చినా వెంటనే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆంధ్ర ఎన్నికలు దెగ్గర పడుతుండటం తో రానున్న రోజుల్లో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

 

 

Comments

comments

Share this post

scroll to top