స్పందించిన సిఎం..పావళా శ్యామలా ను ఆదుకుంటానని అభయం..20 వేల తక్షణ సాయం.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పావళా శ్యామలాకు సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూ  విపరీతంగా షేర్ అవుతూ వచ్చింది. దీనిపై తాజాగా సిఎం కెసీఆర్ స్పందించి పావళా శ్యామలాకు తక్షణ సహాయం కింద 20 వేల రూపాయలు అందజేయడంతో పాటు, ప్రభుత్వం తరఫున నెలకు 10 వేల రూపాయల పించను, డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పేద కళాకారులను ఆదుకునే ప్రయత్నం చేసిన సిఎం గారికి అభినందనలు.

పాత్రకే ప్రాణం పోసే పావళా శ్యామలా ప్రస్తుత దుర్బర జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు తన ఇంటర్వ్యూ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ ను మనస్పూర్తిగా అభినందించాలి. తన ఫ్రెండ్ ద్వారా పావళా శ్యామలా గురించి తెలుసుకున్న నమస్తే తెలంగాణ రిపోర్టర్ తన పెన్ తో రంగంలోకి దిగాడు. మాములుగా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన అతడు ఆమె పరిస్థితి చూసి చలించాడు. సినిమా వాళ్ళ ఇల్లులు ఇలా కూడా ఉంటాయా..? తెర పై నవరసాలు పలికించే వారి జీవితాల్లో ఇతంటి అంధకారం కూడా ఉంటుందా..? కళనే నమ్ముకున్నా వారికి పరిస్థితి ఇలా ఉంటుందా.? అని ఆశ్చర్యపోయాడు.!

12507325_851851124927633_1799798355568411961_n

ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు.. చిన్నగా పరిచయ కార్యక్రమాన్నిమొదలు పెట్టాడు..తర్వాత ఫ్యామిలీ గురించి అడిగే ఆన్సర్ చేస్తూ ఆమె కన్నీళ్ళ పర్యంతమైంది.. మనసులోని మాటలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉండే అతనికి కూడా కన్నీళ్ళు ఆగలేదు. అందరూ చచ్చాక అయ్యోపాపం అనే వారే కానీ బతికుండగా పట్టించుకునే వారుండరు అని ఆమె చెప్పిన లైన్ అతన్ని ఎక్కడో టచ్ చేసింది… ఉదయ్ కిరణ్, రంగనాథ్ లా నేనూ ఆత్మ హత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె అంటుంటే …ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నమైతే చేశాడు కానీ… లోలోపల చాలా మధన పడ్డాడు ఆ రిపోర్టర్.

ఆమె బాధను …… చాలా పొందికగా పద్దతిగా ఆమర్చి… పావళా లేని శ్యామలా అంటూ హృంద్యమైన టైటిల్ ను పెట్టి… ఆమె  జీవితాన్ని కళ్ళకు కట్టాడు ఆ రిపోర్టర్. ఆ అక్షరాల క్రమమే అందరి హృదయాలను కరిగించింది…. సోషల్ మీడియా ఎఫెక్ట్ తో అందరినీ టచ్ చేసింది…పెద్ద మనసు గల దాతలెందరో ముందుకొచ్చారు. ఫైనల్ గా సిఎం కెసిఆర్ సైతం పావళా శ్యామలా ఇంటర్వ్యూ చూసి చలించి… 20 వేల రూపాయలను తక్షణ సహాయంగా.. నెలకు 10 వేల పించనుతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా అందిస్తానని హమీ ఇచ్చారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో పావళా శ్యామలా తన చివరి కోరికను తీర్చుకుంది. ఆ చివరి కోరికను తీర్చుకోవడానికి ప్రధాన కారణమైన నమస్తే తెలంగాణ రిపోర్టర్ ను మనమందరం అభినందించాల్సిందే. తన కళం తో ఓ పేదకళాకారురాళి ఇంట్లో వెలుగులు ప్రసాదించిన నమస్తే తెలంగాణ రిపోర్టర్  కు హ్యాట్సాఫ్.

పావళా శ్యామలా తో ఇంటర్వ్యూ:

12509302_851245324988213_7841468955985046620_n

Comments

comments

Share this post

scroll to top