బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమిపుత్ర శాతాకర్ణి' చిత్ర ప్రారంభోత్సవంలో KCR ప్రసంగం.

కొత్త శకానికి నాంది పలికిన గౌతమిపుత్ర శాతాకర్ణి చరిత్రను  తెలుగు గడ్డ మీదున్న ప్రతి ఒక్కరు తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు KCR. బాలకృష్ణ  100 వ చిత్రం గౌతమిపుత్ర శాతాకర్ణి చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయిన కెసిఆర్…తనకు అత్యంత ఇష్టమైన మహానటుడు నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ వందో చిత్రం ప్రారంభోత్సవానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒక శకానికి నాంది పలికిన యుగపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి కథను వందో చిత్రంగా నిర్మించ తలపెట్టిన బాలకృష్ణను తెలుగువారంతా అభినందించాలన్నారు. ఈ చిత్రం కచ్చితంగా 200 రోజులు ఆడుతుందని ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలందరూ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చూసి ఆయన చరిత్ర తెలుసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. మద్రాసీలుగా పిలవబడుతున్న తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కేసీఆర్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ను తమ ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నిస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని… తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్‌ గుర్తులను తాము ఎన్నటికీ చెరపబోమన్నారు. ఎన్టీఆర్‌ కుమారుడైన బాలకృష్ణ వందో చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పూర్తయ్యాక తొలి బ్యాచ్‌లోనే తనకు సినిమా చూపించాలని కేసీఆర్‌… బాలకృష్ణను కోరారు. కుటుంబంతో కలిసి వచ్చి సినిమా చూస్తామని అన్నారు. దీనికి బాలయ్య స్పందిస్తూ మీకే మొదటిగా సినిమా చూపిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

వెంకటేష్‌ ఏ స్టారో తెలీదు
ప్రసంగం సమయంలో చిరంజీవి గురించి ప్రస్తావించిన కేసీఆర్‌… మెగాస్టార్‌ అని సంభోధించారు. పక్కనే ఉన్న వెంకటేష్‌ గురించి మాట్లాడుతూ… ఆయన ఏ స్టారో నాకు తెలియదని చమత్కరించారు. ఆ సమయంలో ‘విక్టరీ’ వెంకటేష్‌ అంటూ అభిమానులు నినాదాలు చేశారు

Watch KCR Speech @ Goutami putra Shatakarni Launch:

Comments

comments

Share this post

scroll to top