ఆంధ్ర లో నాకున్న క్రేజ్ చూసి నేనే షాక్ అయ్యా – కేసీఆర్!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన విపరీతంగా విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇంత తీవ్రంగా కామెంట్స్ చెయ్యడం దేశం లో బహుశా ఇదే మొదటి సారి అయ్యుండొచ్చు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఇటీవల వైజాగ్ కు వెళ్ళినప్పుడు వైజాగ్ లో అయనకున్న ఫాలోయింగ్ చూసి ఆయనే షాక్ అయ్యారు.

19 కిలోమీటర్ల మేర వేలాది మంది జనాలు – కేసీఆర్ :

“నేను మొన్న వైజాగ్ కి పోయిన, నేను భగవంతుడిని నమ్ముతా, యజ్ఞాలు యాగాలు చేయిస్తా. శారదా పీఠం స్వామిజి నాతో యాగం చేయించారు, రాజశ్యామల యాగం చేశాను, రాజశ్యామల అమ్మ వారి మందిరం వైజాగ్ లో అయన ఆశ్రమం లో ఉంది. ఇంక మన రాష్ట్రం లో ఎక్కడ లేదు, చాలా రేర్ గా ఉన్నాయ్ ఆ గుళ్ళు. ముఖ్యమంత్రిగా గెలిచాక వైజాగ్ లోని అమ్మవారి గుడికి రమ్మన్నారు స్వామిజి. భువనేశ్వర్ కి పోతు వైజాగ్ కి వెళ్లిన ఆశ్రమం కి వెళ్దాం అని. వేలాది మంది జనాలు, 19 కిలోమీటర్ ల పొడవునా కేరింతలు, బిల్డింగుల పైనుండి జనాలు చేతులు ఊపుతూ, అక్కడక్కడా అభిమానము ఉన్న వాళ్లు ఫ్లెక్సీ లు బ్యానర్ లు వేపించారు. చేతులు ఊపుతూ దారి పొడువునా గ్రీట్ చేసాం, దర్శనం చేసుకున్నాక స్వామిజి ఆశ్రమం లో అన్నం తిని బయల్దేరాం. కానీ పేపర్ లలో ఏమో వైకాపా పార్టీ నాయకులు జనాలని ఆరెంజ్ చేసారు, వెలమ ప్రజలు కావాలనే చేసారు అంటున్నారు. వెలమ ప్రజలు ఆంధ్ర వాళ్లే కధ. ఇష్టమొచ్చినట్టు రాసారు ఆ పేపర్ వాళ్ళు, నేనొస్తే వెల్కమ్ చెప్పకూడదా, ఇంత స్వార్ధమా. ఆ తరువాత అడిగా మా వాళ్ళకి, ఇంత మంది జనం వచ్చారు ఏంటయ్యా నాకు వెల్కమ్ చెప్పడానికి అని, అప్పుడు వారే చెప్పారు, మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ని చిత్తు గా ఓడించినందుకు మిమ్మల్ని చూడటానికి వచ్చారు జనాలు, సంతోషం ఎక్కువై పోయింది వాళ్ళకి అని నాతో చెప్పారు, ఈ సారి ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోతాడు అని” కేసీఆర్ అన్నారు.

Watch Video :

Comments

comments

Share this post

scroll to top