KCR కు 'లవ్' షాకిచ్చిన ప్రత్యూష!?

సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ‘ప్రత్యూష’ గురించి అందరికీ  తెలిసిందే.మీడియా ద్వారా ఆమె కష్టాలు వెలుగులోకి రావడంతో చలించిన  తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యూష  చదువు , పెళ్లి  బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రత్యూష తన దత్త పుత్రిక అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అన్నమాట ప్రకారం ప్రత్యూష ను చదివిస్తున్నారు. ఇటీవలే  విడుదలైన ఇంటర్ ఫలితాల్లో  ప్రత్యూష పాస్ అయ్యింది. B.Sc నర్సింగ్ చేయాలనేది ఆమె కోరిక… అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో ప్రత్యూష ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తినే చేసుకుంటానని ప్రత్యూష మొండిపట్టు పడుతుందట.! ఎన్ని కౌన్సెలింగ్ లు ఇచ్చిన ఆమె నిర్ణయంలో మార్పు రావట్లేదట!?

తాను కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన మద్దిలేటి రెడ్డిని  ప్రేమించానని, అతన్నేపెళ్లి చేసుకుంటానని తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించిందట  ప్రత్యూష . ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్‌నని, తన ఇష్టప్రకారం చేయాలని ప్రత్యూష పట్టుపడుతున్నట్లు సమాచారం, ఈ మ్యాటర్ సిఎం కెసిఆర్ వరకూ వెళ్లిందట…..దీనిపై సిఎం అసహనానికి గురై..అప్పుడే పెళ్లేమిటి అని అధికారులతో  అనట్టు సమాచారం.

pratyusha

గ్లోబల్ హాస్పిటల్ లో పరిచయం, తనకంటూ ఒకరు అనే అభిప్రాయం.:

సవతి తల్లి చిత్రహింసల తర్వాత..గ్లోబల్ హాస్పిటల్ లో ప్రత్యూష చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రికి మద్దిలేటి తన మిత్రుడిని చూడడానికి వచ్చాడట…. అప్పుడే వీరి మద్య పరిచయం ఏర్పడిందట.. ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడట, ఇలా వారి పరిచయం, స్నేహం క్రమంగా పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది.ఇప్పుడు ప్రత్యూష తాను  హాస్టల్‌లో ఉండలేనని, తాను ప్రేమించిన వ్యక్తిని   పెళ్లి చేసుకున్నాకే B.Sc నర్సింగ్ చేస్తానని చెబుతోంది. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో పెళ్లి చేసుకోడానికి తాను సిద్దమని ప్రత్యూష ప్రియుడు మద్దిలేటిరెడ్డి స్పష్టం చేశాడు. తన ఇంట్లో కూడా ఒప్పించానని తెలిపాడు.మద్దిలేటి ప్రస్తుతం….. ఓ ఆటోమొబైల్ షాప్ లో గుమస్తాగా చేస్తున్నాడు.

New-Picture

Comments

comments

Share this post

scroll to top