పరీక్షకు గంట ముందు పురిటినొప్పులు-ప్రసవం-తిరిగొచ్చి పరీక్షరాసిన వైనం.హ్యాట్సాఫ్ కవిత.

పరీక్ష గెలిచి పరీక్ష రాసిన అమ్మ కథ..కథలన్నీ ఒకేలా ఉండవు…కొన్ని కథలు ఏడిపిస్తాయి..కొన్ని కథలు నవ్విస్తాయి.. మరి కొన్ని కథలు ఆలోచింప జేస్తాయి…ఈ కథ మాత్రం జీవన పోరాటమంటే ఏంటో.. జీవిత యుద్దం ఎలా ఉంటుందో…
యుద్దం లో దిగాక ఎలా గెలిచి నిలబడాలనుకుంటుందో చెప్పే కథ..యథార్థ కథ… అమ్మ తనం విలువను తట్టిలేపిన కథ…తన బిడ్డ భవిష్యత్ కోసం పురిటినొప్పులు పూర్తవగానే మొదలైన కథ…

మహబూబ్ నగర్ జిల్లా మ‌ల్ద‌క‌ల్ మండ‌లంలో కథ మొదలైంది.. మండలానికి చెందిన క‌విత‌ టెట్ పరీక్ష రాసేందుకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంది. అయితే ఏంటి ఇందులో గొప్పేముందనే కదా… అసలు కథ ఇప్పుడే మొదలవబోతోంది. కవిత 9 నెలల గర్బిని.. ఇంకో గంటలో పరీక్ష ప్రారంభమవబోతుందనగా ఉన్నట్టుండి పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి వెళితే పరీక్ష రాయడం కష్టమే… ఆస్పత్రికి వెళ్లకపోతే జీవిత పరీక్షలో ఓడిపోక తప్పదు… ఏం చేయాలి… కవిత మదిలో ప్రశ్న మొదలవడమే ఆలస్యం… ఆమెకు తెలియకుండానే 108లోకి ఎక్కేసింది…

హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోవడం… క్షణాల్లో పండటి పాపకు జన్మనివ్వడం అన్ని జరిగిపోయాయి. సరిగ్గా 10 నిమిషాల తరువాత కవితకి మెలకువొచ్చింది.. లేచే చూసేసరికి ఆస్పత్రి బెడ్ పైన.. పక్కని పండంటి పాపతో… ఆ క్షణాన ఏ తల్లికైన ఆనందం ఆకాశమంత ఉంటుంది… కానీ కవితకు మాత్రం మనసులో ఏదో దిగులు. వెంటనే వైద్యురాలిని పిలిచింది నేనెలెగైనా పరీక్ష సెంటర్ కి వెళ్లాలి.. పంపించరూ అంటూ అడిగింది. ఈ టైంలోనా నో వే అడుగు తీసి అడుగు వేయడనే కష్టం అలాంటింది పరీక్ష రాయడానికి వెళుతావ వద్దమ్మా.. అంటూ చెప్పుకొచ్చింది.

13256143_1793473750875950_8939054413072167842_n
సీన్ కట్ చేస్తే…. పరీక్ష హలులో కవిత… 2.30 గంటలు ఓపికగా టెట్ పరీక్ష రాసింది. ఆ దైర్యం ఆ తెగువ చూసి… వైద్యులే కాదు తోటి అభ్యర్థులు ఆశ్చర్యపోయారు. కవిత మాత్రం ఏం జరగనట్టు అమ్మగా తన పని తాను చేసుకుని పరీక్ష హాలు నుండి నేరుగా తన పాప దగ్గరికి చేరుకుంది. తను చాలాకాలంగా టెట్ కు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పింది కవిత. అంతేకాదు తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. ఇది ఓ కవిత కథ.. అమ్మ తనం విలువ చెప్పిన కథ… జీవితంలో గెలవలని పట్టువదలని వీరనారి కథ. తల్లిగా గెలిచిన కవిత… ఉద్యోగ అభ్యర్థిగా గెలవాలని మనందరం ఆశీద్దాం.

  • -/-  స్వేన కలం..

Comments

comments

Share this post

scroll to top