బ్రాండ్ల పేరుతో సౌంద‌ర్యాత్మ‌క హింస‌ను, ఆచారాల పేరుతో అడ్డ‌గోలు నియ‌మాల‌ను… త‌న కుంచెతో చ‌ర్చ‌కు పెట్టిన చిత్ర‌కారిణి.!

బ్రాండ్ల పేరుతో జ‌రుగుతున్న సౌంద‌ర్యాత్మ‌క హింస‌, ఆచారాల పేరుతో న‌డుస్తున్న‌ అడ్డ‌గోలు నియ‌మాలు…వీటినే అంశాలుగా ఎన్నుకొని త‌న‌దైన శైలిలో వ్యంగ్య చిత్రాలు గీస్తూ….స్త్రీల స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు ప్ర‌ముఖ చిత్ర‌కారిణి క‌వియా ఇలాంగో..! ఆమె కుంచె నుండి జాలువారిన కొన్ని చిత్రాలు- అవి తెలుపుతున్న భావాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.!

1)నెల‌స‌రి అయితే పెద్ద శిక్షే.!
శుభ‌కార్యాల‌కు దూరంగా, ఆఖ‌రికి జాడీలోని ప‌చ్చ‌డి తీయ‌డానికి కూడా దూరంగా…నెట్టివేయ‌బ‌డ‌తారు.

 

2) వంటిల్లే స‌ర్వ‌స్వం.
ఇంటికొచ్చిన ప‌రాయి మ‌గాడిని కూడా చూడ‌కూద‌నే నియ‌మాలు.

 

3) ఆమె దేహ‌మే ప్ర‌క‌ట‌న‌ల గోడ‌.

వివిధ బ్రాండ్ల వ‌స్తువుల పేరుతో… స్త్రీ త‌న శ‌రీరాన్ని ఎలా హింసించుకుంటున్నారో తెలిపే ప్ర‌య‌త్నం.!

4)ఆమెకు నిషిద్దం.!

ప్ర‌కృత్తి నియ‌మాలు కూడా స్త్రీల‌కు వ‌ర్తించ‌వా.?

 

 

Comments

comments

Share this post

scroll to top