కత్తి మహేష్ నన్ను బలవంతం చేశాడు: సునీత .. దీనికి కత్తి స్పందనేంటి???

గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంలా వ్యాపించి ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ కి తామెలా బలయ్యింది చెప్తున్నారు.ఈ నేపధ్యంలో  ఓ టీవీ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత.. కత్తి మహేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే  లైవ్ షోలో కత్తి మహేశ్ పక్కనుండగానే మహేష్ తనను రమ్మని పిలిచాడని.. గదిలోకి పిలిచి తనను బలవంతం చేశాడని.. తనను కొట్టాడని వెల్లడించింది. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఇంతకీ సునీత ఏమని ఆరోపించింది..దానికి కత్తి ఏం సమాధానం ఇచ్చారు..

‘‘కత్తి మహేష్ సంవత్సరం క్రితమే నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారు. ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్‌లో మహేష్ కలిసినపుడు ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నాను. అప్పటి వరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన గురించి ఏమీ తెలియదు. ఈయనేంటి బిగ్‌బాస్‌కి రావడమేంటని నేను షాక్ అయ్యాను. ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను. ‘నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను అన్నారు. కలుస్తావా నన్ను..’ అని అడిగారు. కత్తి మహేష్ ఇలా చేస్తే నేనెవరికి చెప్పుకోవాలి?

కత్తి మహేష్‌ పై కంప్లైంట్ ఇవ్వడానికి లీగల్‌గా వెళ్లాను. ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్‌కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోంది. కానీ మహేష్‌పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు చెప్పారు. అంతకు ముందొకసారి నన్ను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడు. కావాలంటే నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ చూపిస్తా. వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. నేను ముందే చెప్పాను ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని.. దానికి నేను అంగీకరించను. అప్పుడు నన్ను డోర్ వేసి.. కొట్టి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడు. కత్తి మహేష్‌పై అన్ని ప్రూఫ్‌లు చూపిస్తా’’ అని సునీత పేర్కొంది.
‘‘సునీత తన వద్ద డబ్బుల్లేవంటే నేను అప్పుడప్పుడు డబ్బు సాయం చేసేవాడిని. ఆమె ఒకసారి ఇంటికి వస్తే బయటే మాట్లాడి పంపించాను. తర్వాత ఇంటికి వస్తే డబ్బులిచ్చి పంపించాను అయితే నాపై సునీత అటెమ్ట్ టు రేప్ అంటూ ఆరోపణలు చేస్తోంది. బిగ్‌బాస్ తర్వాత నాకేదో ఫేమ్ వచ్చిందని నేను ఫీలవుతున్నట్టు.. అమ్మాయిలను మోసం చేస్తున్నట్టు’’ ఆమె ఆరోపిస్తోందని కత్తి మహేష్ తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top