ఆ రెండు పాత్రలు లేని బాహుబలి అసంపూర్ణం.!

బాహుబలి చిత్రంలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆణిముత్యం, అలా తీర్చిదిద్దాడు డైరెక్టర్ రాజమౌళి.. ప్రభాస్, రానా,రమ్యకృష్ణ, తమన్నాల నటనకి  ఇప్పటి వరకు అందరూ జేజేలు పలికారు. కానీ సినిమా సక్సెస్ కు  కీ రోల్స్  లాంటి పాత్రలు ఇంకా రెండున్నాయ్. వాటి గురించి అంత చర్చ ఇంకా జరగడం లేదు. రానా,రమ్యకృష్ణ లను దాటి మన పరిధి ఇంకా పెరగడం లేదు. కానీ నిజంగా బాహుబలి దృశ్య కావ్యానికి మాత్రం ఆ రెండు పాత్రలు పరిపూర్ణతనిచ్చాయి.

అందులో ఒకటి కట్టప్ప, మరోటి కాలకేయ.. అవును ఈ రెండు పాత్రలు లేని బాహుబలి అసంపూర్ణం. అంతలా లింక్ అయ్యాయి, ఈ పాత్రలు బాహుబలి సినిమాతో. వీటిని లేకుండా సినిమాను ఊహించడం అసాధ్యం. అంతే కాదు వీరి స్థానాల్లో వేరే వారిని ఊహించడం కూడా ఇంపాసిబుల్… అంతగా సింక్ అయ్యారు వీరిద్దరూ ఆ  పాత్రలకు.

కట్టప్పగా అదరగొట్టిన సత్యరాజ్.

తమిళ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన  సత్యరాజ్ తెలుగులో కూడా చాలా సినిమాలే చేశాడు. కానీ మిర్చి సినిమాలో ప్రభాస్ కు తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు సత్యరాజ్. ముఖ్యంగా బాహబలిలో మాహిశ్మతీ రాజ్యానికి సేనాని పాత్రను పోషించి సినిమాకి కీ రోల్ గా మారారు. నమ్మిన బంటుగా అతని నటన ఆకట్టుకుంది. ఇతడి డైలాగ్ తోనే బాహుబలి పార్ట్ 1 ను ఎండ్ చేశాడు రాజమౌళి, దీనిని బట్టి చూస్తుంటే పార్ట్-2 లో సత్యరాజ్ ది ఇంతకు మించిన పాత్ర ఉంటుందని చెప్పుకోవొచ్చు.

కాలకేయగా కిళ్ కిళ్ చేసిన ప్రభాకర్:

చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న ప్రభాకర్, రాజమౌళి కంట్లో పడడంతోనే  అతని అసలు సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యింది. మర్యాద రామన్న సినిమాతో ప్రభాకర్ కు రాజమౌళికి మద్య మంచి బంధం ఏర్పడింది. ఎంతగా అంటే బాహుబలి సినిమాలో చాలా కీలకం అయిన కాలకేయ పాత్ర ను ప్రభాకర్ తో చేయించేంతగా….. కిల్ కిల్ భాషతో, సరికొత్త వేషంలో.. కాలకేయగా అలరించాడు ప్రభాకర్. మరో విషయం ఏంటంటే రాజమౌళి మీద ఉన్న గౌరవం తో తన కొడుక్కి రాజమౌళి అనే పేరు పెట్టుకున్నాడు ప్రభాకర్.

మాగ్జిమమ్ మన తెలుగు సినిమాల్లో, హీరో, హీరోయిన్ తప్ప..ఇతరులకు అంత స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వడం చాలా అరుదు. అటువంటింది ప్రధాన పాత్రలతో పోటీపడి నటించడానికి స్కోప్ ఉన్న పాత్రల్లో వీరిద్దరూ అదరగొట్టారు. కట్టప్పగా ఒకరు, కాలకేయగా మరొకరు ఇరగదీశారు. ఇక బాహుబలి పార్ట్ 2 లో వీరి నటనను చూడడానికి ఇప్పటి  నుండే రెడీ అయిపోయారు ప్రేక్షకులు. కానీ పార్ట్-2 లో కాలకేయ పాత్ర ఉండడం మాత్రం అనుమానాస్పదమే!

CLICK: బాహుబలికి అధనంగా కలపనున్న కొత్త సీన్లు.

CLICK: బాహుబలి పార్ట్-1 కు పది ప్రశ్నలు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top