“కట్నం” వల్ల 7 లాభాలు అంట..! బి.ఏ టెక్స్ట్ బుక్ లో ఏమని రాసారో చూస్తే పక్కా కోపమొస్తుంది..!

నేడు సమాజంలో ఉన్న వివిధ రుగ్మతలలో ఒకటి “వరకట్నం ” ,ఇది సామాన్యుల గుండెల మీద కుంపటి లాగా తయారైంది. వధువు గౌరీ పూజ చేస్తూంటే వరుడు డౌరీ పూజ చేసే దుస్థితి వచ్చింది. ఆడ పిల్లల తల్లితండ్రులు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక సతమతమై ,ఆత్మహత్యలకు గురైనారు ,కొందరైతే ఆడ పిల్లలలను బాల్యంలోనే మట్టుపెడుతున్నారు.ఇటువంటి వాటిని ఆపి సమాజంలో స్త్రీ గౌరవాన్ని పెంచాలి,స్త్రీ అవసరాన్ని చాటిచెప్పాలి అని భావించే వారికి వ్యతిరేకమా అన్నట్లు వున్నది ఒక విద్యాసంస్థ. అవును.ఇది నిజమే.. బెంగళూరు లోని st .జోసెఫ్ కాలేజీ లోని బి.ఏ సోషియాలజీ లోని ఆరవై మంది విద్యార్థులుగల తరగతిలో ,ఉపాధ్యాయుని సమక్షంలో ఒక విద్యార్థి చదివిన స్టడీ మెటీరియల్ యొక్క సారమిది.

ఒక అసాధారణ అమ్మాయి కి తన జీవితభాగస్వామితో వివాహం అధిక డౌరీ తో జరిపించవచ్చు,అంతే కాకుండా అధిక కట్నం తెచ్చే మహిళకు అదిక ప్రాధాన్యం ఉంటుందట.డౌరీ ని బట్టి మహిళకు భర్త గౌరవం ,అత్తా మామల ప్రోత్సాహం ఉంటాయట,కట్నం వల్ల ఆ జంటకు కొంత రక్షణ,మరియు వాళ్ళ కొత్త కాపురానికి పనికొస్తాయట.అంతేకాక వరుడు పేద వాడైతే తనకు ఒక వ్యాపారము చేయవచ్చని ,వాళ్ళ స్టేటస్ ను పెంచి వధువు కు గౌరవాన్ని ఇస్తుందని ,కట్నం తోనే కోడలికి కొత్త గౌరవమన్నట్లు తెల్పింది,ఐతే కట్నాన్ని సమర్ధించే వారికి ఇది కొంత ఊరట కల్గించినా,మిగిలిన వారికి మాత్రం ఊపిరాడకుండా చేస్తున్నది , ఇలా చదివినందుకు ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా రోజులో 1200 షేర్లు జరిగాయట.

ఏదేమైనా స్త్రీ ని గౌరవించే ఈ దేశంలో స్త్రీ ని సంపద తో కొనాలనుకోవడం నేరం,ఎందుకంటే అధిక డౌరీ కోసం ఆస్తులు అమ్మి కూతురి పెళ్లి చేసి అల్లుడికి జీవితాన్నిస్తే ,వాళ్ళ తల్లిదండ్రుల జీవితం …..??,దేశంలో ఎన్నో కుటుంబాలు కూలి పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు మరి వాళ్ళ కూతుర్లకు మంచి వరుడు రాడా..?, ధనంతో దారిద్యాన్నిమార్చవచ్చు కానీ ,బ్రతుకులను మార్చవచ్చా….?? దీనిని మీరు సమర్థిస్తారా ….??

Comments

comments

Share this post

scroll to top