డెలివరీ తరువాత అమృతను వెంటనే డిశ్చార్జ్ చేసాం అనడానికి కారణం ఏంటి.? దెగ్గరికి ఎవ్వరిని ఎందుకు రానివ్వలేదు.?

తెలంగాణ లో జరిగిన పరువు హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అమృత ప్రణయ్ లు గత ఏడాది వివాహం చేసుకున్నారు, సరిగ్గా వాళ్లకు పెళ్లి అయి ఏడాది అయిన రోజే అమృతకు బిడ్డ పుట్టాడు. ప్రణయ్ చనిపోయే సమయానికి అమృత ఐదు నెలల గర్బిణీ. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. చనిపోయిన ప్రణయ్ పిల్లాడి రూపంలో జన్మించాడని వారు సంబరపడుతున్నారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మాట్లాడుతూ, తాను తన బిడ్డ కోసం బతుకుతానని చెప్పింది.

కారణం తెలీదు.. :

హైదరాబాద్ లోని ఫెర్నాండేజ్ హాస్పిటల్ లో అమృత ను అడ్మిట్ చేసినట్టుగా సమాచారం అందింది మీడియా కు, ఆ హాస్పిటల్ కి వెళ్లి మీడియా అమృత గురుంచి అడగ్గా, హాస్పిటల్ సిబ్బంది అమృత ఆ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదని తెలిపారు. మహిళా సంఘాలకు సంబంధించిన ఆడవారు, ట్యాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ క బాప్ కత్తి మహేష్ ని కూడా హాస్పిటల్ వాళ్ళు లోపలికి వెళ్లనివ్వలేదు, కత్తి మహేష్ కి కూడా అమృత మా హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదని హాస్పిటల్ మ్యానేజ్మెంట్ వారు తెలిపారు. మరి హాస్పిటల్ పైన ఏవైనా డిబేట్స్ పెడతాడో, లేక కేసు లే పెడతాడో వేచి చూడాలి.

అగ్రిమెంట్ ఏ కారణమా.?

అమృత ను హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవాలంటే డెలివరీ సమయం లో మీడియా వాళ్ళు కానీ, ప్రముఖులు కానీ, క్రిటిక్స్ కానీ( కత్తి మహేష్ లాంటి వాళ్ళు) చూడటానికి రాకూడదు, ఒకవేళ వస్తే డెలివరీ అయిన వెంటనే డిశ్చార్జ్ చేస్తాం అని హాస్పిటల్ మ్యానేజ్మెంట్ వారు ఒప్పందం చేసుకున్నారని వార్తల్లో చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద హాస్పిటల్ సిబ్బంది స్పందిస్తూ, అలంటి ఒప్పందం ఏమి జరగలేదు, అమృత మా హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదని తెలిపారు.

హి ఇస్ బ్యాక్.. :

తనకి బిడ్డ పుట్టాడని ఫేస్బుక్ లో అమృత  తెలిపింది. పెళ్లి అయి సంవత్సరం అయిన రోజే పిల్లోడు కూడా పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ అంతా అమృత కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కులాంతర వివాహమే కారణం .. :

తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,
అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన, ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అక్రమాస్తి డబ్బు వల్లే మానవత్వాన్ని మరచిపోయిన ఆయన హత్య చేయించారని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమృతరావు జైలు జీవితం గడుపుతున్నాడు.

Watch Video:

Kathi Mahesh About Amrutha |

Comments

comments

Share this post

scroll to top