జైలు నుండి “శశికళ” షాపింగ్ కి వెళ్ళొచ్చింది తెలుసా..? వీడియో లీక్ అవ్వడంతో పెద్ద ట్విస్ట్..!

మొన్నటికి మొన్న కర్ణాటక జైలులో శశికళకు రాచమర్యాదలు జరుగుతున్నాయని,దీనికొరకు రెండు కోట్లవరకు చేతులు మారాయని ఐపీఎస్ అధికారిణి రూప వెల్లడించారు..ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన వంటగది, ములాఖత్‌ కింద వచ్చిన వారితో మాట్లాడేందుకు మరో గది, యోగా గది, టీవీ వీక్షణకు మరో రూం, బాత్‌రూం.. మొత్తం ఐదు గదులు, ఖరీదైన మంచం, సోఫా,  రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషీన్, ఇలా అనేక గృహోపకరణాలు, హాయిగా నడయాడేందుకు పొడవాటి వరండా…తన ప్రత్యేక వంట గదిలో ఇడ్లీ, దోసెలు, మాంసాహారం…శశికళకు జరుగుతున్న రాచమర్యాదల లిస్టు..ఈ సదుపాయల కల్పన కోసం చేతులు మారిన మొత్తం రెండు కోట్లు… దీన్ని బయటపెట్టిన మాజీ డిఐజీ…కానీ ఇప్పుడు  జైల్లోని చిన్నమ్మ లగ్జరీ జీవితం ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా బయటకు పొక్కింది. అంతేగాక, జైలు దుస్తుల్లో కాక ఖరీదైన నైటీలో చేతిలో బ్యాగ్‌తో శశికళ నడుస్తున్న వీడియో దృశ్యాలు తమిళనాడు, కర్ణాటక  ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేశాయి.
డీఐజీ రూప ప్రకటన వల్ల జైల్లోని లోగుట్టు రట్టుకావడంతో ప్రభుత్వం  రూప సహా నలుగురు అధికారులను బదిలీచేయడమే కాదు పనిలో పనిగా  శశికళకు కల్పించిన సదుపాయాలను కోతవిధించింది. అధికారులు టీవీ కనెక్షన్‌ను తొలగించారు. వీఐపీగా చెలామణి అయిన శశికళ మంగళవారానికి సాధారణ ఖైదీగా మారిపోయారు.
 కొసమెరుపు
జైలు తనిఖీ సమయంలో శశికళకు కల్పించిన సదుపాయాలను చూసి బిత్తరపోయిన రూప వాటిని సెల్‌ఫోన్‌లో చి త్రీకరించినట్టు..ఆ టైంలలో రూపతో శశికళ గొడవపడట్టు ఈ వీడియోల్లో తెలుస్తుంది.కర్ణాటక సీఎం నుంచి అందరూ నాకు తెలుసు, వారికి లేని అభ్యంతరం నీకెందుకు, వారం రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తా అని రూపను బెదిరించినట్లు సమాచారం. అయితే, ముందు జాగ్రత్త చర్యగా జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను సీసీ టీవీ కెమెరా నుం చి డౌన్‌లోడ్‌ చేసుకుని సీడీలో రికార్డు చేసుకున్న తరువాతనే మీడియా ముందుకు రూప వచ్చినట్లు  సమాచారం.

watch video here:

Comments

comments

Share this post

scroll to top