ఎక్కువ పని చేసాడని బేకరీలో పని చేసే అతనికి 2.3 లక్షల ఫైన్ వేశారు.! ఎందుకో తెలుసా..?

అవును, నిజ‌మే మరి. ప‌నిచేస్తేనే ఎవ‌రికైనా నాలుగు వేళ్లూ లోప‌లికి వెళ్లేది. ప‌నిచేయకుండా తిండి దొర‌కాలంటే ఎలా వ‌స్తుంది ? క‌ష్ట‌ప‌డితేనే క‌దా సుఖం ద‌క్కేది. అయితే క‌ష్ట‌ప‌డ‌మ‌ని చెప్పారు క‌దా అని చెప్పి అదే ప‌నిగా క‌ష్టం కూడా చేయ‌కూడ‌దు. కొంత ఆట విడుపు ఉండాలి. పనికి కొంత విరామం ఇవ్వాలి. అలా కాకుండా అదే ప‌నిగా ప‌ని చేయ‌కూడ‌దు. అయితే ఇలా ఏ మాత్రం విరామం లేకుండా ప‌నిచేసే వారికి ఇత‌ర దేశాల్లో ఏ శిక్ష‌లు వేస్తారో ఏమో తెలియ‌దు కానీ, ఫ్రాన్స్ దేశంలో మాత్రం ఫైన్ వేశారు. అది కూడా భారీ మొత్తంలో. అస‌లు విరామం లేకుండా ప‌నిచేసినందుకు అత‌నికి ఆ ఫైన్ ప‌డింది. ఇంత‌కీ అసలు విష‌యం ఏమిటంటే…

అత‌ని పేరు సెడ్రిక్ వ‌యివ‌ర్‌. ఫ్రాన్స్ దేశ వాసి. ఇతనికి ఓ బేక‌రీ ఉంది. ఫ్రాన్స్‌లోని లుసిగ్నీ సుర్ బార్సె అనే టౌన్‌లో సెడ్రిక్ త‌న బేక‌రీ నిర్వ‌హిస్తున్నాడు. అయితే స‌ద‌రు లుసిగ్నీ టౌన్ ఉన్న ప్రాంతం టూరిస్టుల‌కు కేంద్రంగా ఉంటుంది. అక్క‌డికి నిత్యం ప‌ర్యాట‌కులు వ‌స్తూనే ఉంటారు. చుట్టూ ఉండే ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం, ఆహ్లాద‌క‌ర‌మైన స‌ర‌స్సులు, ప‌క్షుల‌ను చూసి ఎంజాయ్ చేస్తారు. ఇక వేస‌విలో ఆ ప్రాంతానికి ప‌ర్యాట‌కుల తాకిడి కొంత ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఆ టౌన్‌లో నిజానికి సెడ్రిక్ న‌డిపే బేక‌రీ ఒక్క‌టే ఉంటుంది. వేరే ఏ బేక‌రీలు ఉండ‌వు. దీంతో వేస‌విలో వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు మ‌రింత సేవ చేయ‌డానికి అత‌ను త‌న బేక‌రీని ఒక్క రోజు కూడా మూసి వేయ‌కుండా గ‌తేడాది వేస‌వి మొత్తం తెరిచే ఉంచాడు. అదే అత‌ని కొంప ముంచింది.

ఫ్రాన్స్ రూల్ ప్ర‌కారం అక్క‌డి వ్యాపార‌స్తులు ఎవ‌రైనా త‌మ వ‌ర్క‌ర్ల‌కు వారంలో ఒక రోజు సెలవు ఇచ్చి వ్యాపారాన్ని మూత పెట్టాలి. కానీ సెడ్రిక్ అలా చేయ‌లేదు. 2017 వేస‌వి మొత్తం త‌న బేక‌రీని తెరిచే ఉంచాడు. ఇది రూల్స్‌కు విరుద్ధం. క‌నుక అధికారులు అత‌నికి 3వేల యూరోలు (మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.2.30 ల‌క్ష‌లు) ఫైన్ వేశారు. అయితే సెడ్రిక్ మాత్రం తాను పర్యాట‌కుల‌కు ఆహారాన్ని నిరంత‌రాయంగా అందించేందుకే బేక‌రీని 24 గంట‌లూ తెరిచి ఉంచాన‌ని చెబుతుండ‌గా, అత‌నికి స్థానికులు కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఆ టౌన్‌లో కేవ‌లం ఒకే ఒక్క బేక‌రీ ఉంద‌ని, అది సెడ్రిక్ ద‌ని, దాన్ని మూసేస్తే త‌మ‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని, క‌నుక అధికారులు తాము వేసిన ఫైన్‌ను ఉప‌సంహరించుకోవాల‌ని వారు కోరుతున్నారు. ఏది ఏమైనా.. నిజంగా ఈ విష‌యం భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top