వివాదాల వర్మకు..సినీ చరిత్రలో ఇప్పటి వరకు నచ్చిన సీన్ ఇదేనంట!

వివాదాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ సినిమాలలో ఇప్పటివరకూ ఆయనకు నచ్చిన సీన్, నటుడు ఎవరో తెలుసా? 2013లో వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 26/11 లో కీలకపాత్ర పోషించిన నానాపటేకర్ నటించిన ఓ సీన్ తన జీవితంలో ఇప్పటివరకూ నచ్చిన బెస్ట్ సీన్ అని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. పోలీస్ ఆఫీసర్ అయిన నానాపటేకర్, తీవ్రవాది కసబ్ ను మృతిచెందిన తీవ్రవాదుల దగ్గరికి తీసుకెళ్ళి ప్రశ్నించే సీన్ లో, నానాపటేకర్ నటన రియలిస్టిక్ గా నటించే, ఆ సన్నివేశంలో నానా చూపించిన హావభావాలు,;భావోద్వేగాలు తనని కట్టిపడేశాయని వర్మ గుర్తుచేసుకున్నాడు. నానా పటేకర్ నట ప్రతిభను పొగుడుతూ ఆ సీన్ ను తన ట్విట్టర్ ద్వారా వర్మ పోస్ట్ చేశాడు.  2008 నవంబర్ 26న  ముంబైలోని  తాజ్ హోటల్ తో పాటు మరికొన్ని ప్రదేశాలలో పాకిస్థాన్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధం సృష్టించారు. సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి 166మంది ప్రాణా కోల్పోగా, కొంతమంది తీవ్రగాయాల పాలయ్యారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top