డబ్బు కోసం సొంత లవర్ ను…తన ఫ్రెండ్ ను లవ్ చేయమన్నాడు.! (కర్త,కర్మ,క్రియ)

డబ్బు మనిషి జీవితంలో ఎలాంటి పెను మార్పులు తీసుకు వస్తుందో…. క్షణాల్లో మనిషిని ఎలా మారుస్తుందో….ఫర్పెక్ట్ గా చూపించే  ప్రయత్నమే కర్త,కర్మ,క్రియ షార్ట్ ఫిల్మ్. దీనిని చూస్తుంటే షార్ట్ ఫిల్మ్ అనాలనిపించడం లేదు. రెండున్నర గంటల సినిమాకు మించిన అద్భుతాలు…. ఈ 20 నిమిషాల సినిమాలో కనిపించాయ్. సొల్లూ, సోదీ ఏదీ లేదు. డైరెక్ట్ కట్ టు ది పాయింట్.  చెప్పాలనుకున్నదాన్ని… ఆ అమ్మాయి అతడి గుండెల్లో చాకు దించినట్టు  చెప్పేశాడు…డైరెక్టర్.

ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటారు..  మనం సెట్ అవ్వాలంటే నాఫ్రెండ్ ను లవ్ చేయమని అమ్మాయిని అడుగుతాడు అబ్బాయి…అప్రయత్నంగానే ఒప్పుకుంటుంది అమ్మాయి. ఈ  నిర్ణయం మూడు నిండు ప్రాణాలను ఎలా బలితీసుకుందనేదే కథాంశం. పోలీస్ పాత్రను పోషించిన వ్యక్తి సుధీప్ ను పోలి ఉండడం, పక్కనున్న కానిస్టేబుల్ ..సంపూ ను పోలి ఉండడంతో సినిమా పట్ల కొంత  అధనపు ఆసక్తిని క్రియేట్ చేసింది. స్టోరిని ఈ రెండు పాత్రలతో ఓపెన్ చేయడం కూడా ప్లస్ అయ్యింది.

ఇక సినిమా పరంగా చెప్పాలంటే…. సినిమాకు రెండు డిపార్ట్మెంట్స్ ప్రాణం పోశాయని చెప్పొచ్చు. 1) సినిమాటోగ్రఫి 2) BGM    కేవలం  లోకేషన్స్ కోసమే  సినిమాను మూడు సార్లు చూడొచ్చు, ఇక BGM వండర్ ఫుల్….. మద్య మద్యలో వచ్చే ఓ పాట (నిశ్శబ్దపు కుట్రల ఒడిలో……)  కూడా అద్భుతమైన భావాన్ని పలికించింది. మొత్తానికి ఓ చిన్నసినిమాలో…చాలా పెద్ద మెసేజ్ ను ఇచ్చిన కర్త,కర్మ,క్రియ టీమ్ కు అభినందనలు.

Watch Short Film:( Karta,Karma,Kriya):

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top