యాపిల్ వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ జాబ్స్‌, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌ల విజ‌యాల వెనుక ఉన్న అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. ఈ సామెత మాట ఎలా ఉన్నా చాలా మంది మాత్రం ఎవ‌రూ లేకుండానే సొంతంగా ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి, నిత్యం క‌ష్ట‌ప‌డుతూ, ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా కృషి చేస్తూ చివ‌ర‌కు విజ‌యం సాధించారు. అలాంటి వారిని చాలా మందిని చూశాం. వారిలో మ‌న దేశానికి చెందిన వారే కాదు, ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, యాపిల్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ జాబ్స్ కూడా ఉన్నారు. స్వ‌యం కృషితో స్టెప్ బై స్టెప్ ఎదిగిన వారిలో వీరిద్ద‌రు మ‌న‌కు ప్ర‌ముఖంగా క‌నిపిస్తారు. అయితే వీరి విజ‌యం వెనుక కూడా ఓ అజ్ఞాత వ్య‌క్తి ఉన్నార‌ట‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో తెలుసా..?  చూద్దాం రండి..!

karoli-baba
ఉత్త‌రాఖండ్ రాష్ట్రం నైనిటాల్‌లోని క‌రోలి మాతా ఆల‌యంలో క‌రోలి బాబా ఆశ్ర‌మం ఉంది. అందులో ఉండే క‌రోలి బాబానే జుక‌ర్‌బ‌ర్గ్‌, స్టీవ్ జాబ్స్ విజ‌యాల వెనుక ఉన్న వ్య‌క్తి అట‌. ఇప్పుడు క‌రోలి బాబా లేర‌నుకోండి. ఆయ‌న 1973లోనే చ‌నిపోయారు. ఇంత‌కీ క‌రోలి బాబాకు, జుక‌ర్ బర్గ్‌, స్టీవ్ జాబ్స్ విజ‌యాల‌కు సంబంధం ఏంటి అనేగా మీ డౌట్‌..! అదేం లేదండీ. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ ప్రారంభించ‌క ముందు డాన్ కోట్కే అనే త‌న స్నేహితునితో క‌లిసి ఒక‌సారి సంభాషిస్తుంటే మ‌న దేశంలోని క‌రోలి బాబా గురించి స్టీవ్ జాబ్స్ తెలుసుకున్నాడట‌. ఈ క్ర‌మంలో స్టీవ్ జాబ్స్ క‌రోలి బాబాను ఎలాగైనా సంద‌ర్శించాల‌ని భార‌త్‌కు వ‌చ్చాడ‌ట‌. అయితే స్టీవ్ జాబ్స్ వ‌చ్చే లోపే బాబా క‌న్నుమూశార‌ట‌. అయినా స్టీవ్ ఆయ‌న ఆశ్ర‌మంలో కొన్ని రోజుల పాటు ఉన్నార‌ట‌. అనంత‌రం తిరుగు ప్ర‌యాణ‌మై వెళ్లాక కొద్ది నెల‌ల్లోనే యాపిల్ సంస్థ ప్రారంభించి అప్ర‌తిహ‌త విజ‌యాలను అందుకున్నారు. స్టీవ్ జాబ్స్ ఆవిష్క‌రించిన ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఐపాడ్‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌లా ఆక‌ట్టుకున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న విజ‌యం వెనుక ఉన్న వ్య‌క్తి క‌రోలి బాబానే అని స్టీవ్ జాబ్స్ చ‌నిపోయాక తెలిసింది. ఆయ‌న మృత‌దేహం ఉన్న మంచంపై దిండు కింద క‌రోలి బాబా ఫొటో ఒక‌టి దొరికింద‌ట‌. దీంతో ఆ బాబానే స్టీవ్ జాబ్స్‌కు గురువ‌ని అంద‌రూ భావిస్తూ వ‌స్తున్నారు.

karoli-baba-ashram
ఇక జుక‌ర్‌బ‌ర్గ్ విష‌యానికి వ‌స్తే తాను ఫేస్‌బుక్ ప్రారంభించిన కొత్త‌లో తీవ్రంగా న‌ష్టం వ‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలో జుక‌ర్‌బ‌ర్గ్ స్టీవ్ జాబ్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి స‌ల‌హా అడిగాడ‌ట‌. దీంతో స్టీవ్ జాబ్స్ క‌రోలి బాబా గురించి చెప్పగా జుక‌ర్ బ‌ర్గ్ కూడా ఆ ఆశ్ర‌మంలో కొన్ని రోజులు గ‌డిపి అనంత‌రం వెళ్ల‌గానే కొన్ని నెల‌ల్లోనే ఫేస్‌బుక్ విజ‌యాల బాట ప‌ట్టింది. ఇప్పుడు ఆ సంస్థ‌కు ఉన్న పేరు మ‌నంద‌రికీ తెలిసిందే. కాగా మొన్నా న‌డుమ జుక‌ర్‌బ‌ర్గ్ ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు మ‌న ప్ర‌ధాని మోడీకి ఆ బాబా గురించి చెప్పి, అప్ప‌టి జ్ఞాప‌కాల‌ను ఆయ‌న‌తో పంచుకున్నార‌ట‌. అలా స్టీవ్ జాబ్స్‌, జుక‌ర్‌బ‌ర్గ్‌ల విజ‌యాల వెనుక ఉన్న వ్య‌క్తి క‌రోలి బాబాయేన‌ని అంద‌రూ చెబుతున్నారు.

కాగా క‌రోలి బాబా ఆశ్ర‌మానికి కొద్ది దూరంలో ఓ చారిత్రాత్మ‌క‌మైన హనుమాన్ దేవాల‌యం ఉంద‌ట‌. స్వ‌త‌హాగా  హ‌నుమాన్ భక్తుడైన బాబా స్వామి వారి నుంచి కొన్ని దివ్య శ‌క్తుల‌ను పొందార‌ట‌. అందుకే ఆయ‌న‌కు మ‌హిమ‌లు ఉన్నాయ‌ని స్థానికులు చెబుతారు. భూత‌, భ‌విష్య‌త్‌, వ‌ర్త‌మాన కాలాల‌ను బాబా చూడ‌గ‌ల‌ర‌ని, ఆయ‌న‌కు అదృశ్య‌మ‌య్యే శ‌క్తులు కూడా ఉన్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా క‌రోలి బాబా అంటే అక్క‌డి స్థానికుల‌కు మాత్రం అచంచ‌ల‌మైన విశ్వాసం. ఈ క్ర‌మంలో అనేక మంది భ‌క్తులు కూడా అక్క‌డికి వెళ్లి వ‌స్తుంటార‌ట‌. అదీ క‌రోలి బాబా గురించిన అస‌లు విష‌యం.

Comments

comments

Share this post

scroll to top