పబ్లిక్ ఫంక్షన్లో…బూతు సినిమాలు చూస్తూ అడ్డంగా బుక్ అయిన మంత్రి.!

టిప్పు సుల్తాన్ వీరత్వాన్ని పొగుడుతూ ఓవైపు ప్రసంగాలు నడుస్తున్నాయి. అందరూ ఆసక్తిగా వింటున్నారు, అదే కార్యక్రమానికి హాజరయిన మంత్రి మాత్రం….తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో బూతు చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. టిప్పు సుల్తాన్‌‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సైట్  తన సెల్ ఫోన్ లో  అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్  తన కెమెరాలో బంధించాడు. క్షణాల్లో ఆ  వీడియోను టీవీల్లో ప్రసారం చేశారు. అవాక్కయిన సదరు మంత్రి   నాకు సంబంధించిన వీడియోను తీసి ఆ వార్తను బయటపెడతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయి ……రిపోర్టర్, కెమెరామెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చేసిందే తప్పు, దానికితోడు వీడియోలు తీశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.! ప్రతి వ్యక్తికీ స్వేఛ్చ ఉండొచ్చు కాదనలేం, కానీ ఓ గౌరవహోదాలో ఉండి, అదికూడా ఓ పబ్లిక్ ఫంక్షన్ కు హాజరయ్యి…ఇలాంటి బూతు సినిమాలు చూడడం ఎంత వరకు కరెక్ట్? అనేదే అసలు ప్రశ్న?
Watch Video:

Comments

comments

Share this post

scroll to top