ఆటో నడుపుతూనే IAS కు ప్రిపేర్ అవుతున్న మహిళ. కలెక్టర్ అవుతా మహిళలకు అండగా ఉంటాననే ఆత్మవిశ్వాసం.

చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆడుకోవడానికి ఎన్నో దారులు, మరెన్నో సౌకర్యాలు ఉన్నా కూడా కొన్నివేల కారణాలను తమ ఓటమికి సాకుగా చెప్పేవాళ్ళను, చేయలేక మధ్యలోనే నిలిపివేసే వాళ్ళను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఒక మహిళ ఆటో నడుపుతూ ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. తన బిడ్డను చూసుకుంటూ కుటుంబభారాన్ని మోస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆవిడే ఎల్లమ్మ.

 

కర్నాటకలోని బెంగళూర్ లో రద్దీరోడ్లపై, ఆటో కూడల్ల వద్ద, నగరు శివార్లలో ఒక మహిళ ఆటో నడుపుతున్నామె పేరే ఎల్లమ్మ. 18 ఏళ్ళ వయసులో ఆమె వివాహం చేసుకుంది. ఆమె భర్త  పుష్పగుచ్చాలను అమ్ముతూ, ఏదైనా ఫంక్షన్ జరిగితే అక్కడ వాటిని డెకరేట్ చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకు ఆమె భర్త తనకు దూరమయ్యాడు. కుటుంబం భారం ఒకవైపు, భుజస్కంధాలపై తల్లికోసం ఏడ్చే బిడ్డ మరోవైపు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. తన కుటుంబానికి అండగా నిలవావన్నా, తన బిడ్డ భవిష్యత్ బాగా ఉండాలన్నా, తను తీసుకునే ఉత్తమ నిర్ణయంపైనే అందరి జీవితం ఉందని ఆలోచించింది. బెంగళూర్ జీవన విధానం, పెరిగిన జనాభా, కార్పోరేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, వారి ఉరుకుపరుగుల ప్రయాణం చూసిన ఎల్లమ్మ ఆటో నడపడానికి సిద్ధమైంది. తన నిర్ణయాన్ని తన బావతో చెప్పి, తనకొక ఆటో కావాలని అతడికి తెలిపింది. చాలాచోట్ల, చాలామందిని అడిగిన అతను చివరికి ఒక ఆటో యజమానిని రోజు బాడుగకు ఆటో ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే చాలామంది  ఒక మహిళకు ఆటోను నడపడానికి ఇవ్వడానికి వెనకడుగు వేశారు.

Auto-Rickshaw-Women

అలా ఒక మంచిరోజున ఆటోడ్రైవర్ గా తన దినచర్యను మొదలుపెట్టింది ఎల్లమ్మ. ఆటో యజమానికి రోజు బాడుగగా రూ. 130 లు చెల్లించాలి. అలా రోజూ ఆటో నడుపుతూ రూ. 700, 800 వరకు సంపాదించేది. బాడుగ, ఆటో ఇంధనం ఖర్చులుపోయి సగానికిపైగానే డబ్బులు మిగిలేవి. ఉదయం గం. 6 లకు తన దినచర్యను మొదలుపెట్టి, రాత్రి గం.8 వరకు ఆటో నడుపుతూ ఉండేది. అయితే ఇదే నా జీవనమని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితాన్ని నేను మార్చుకోగలను  అనే నమ్మకం ఉంది. అందుకని మ్యాగజైన్స్, టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు, మన సమాజంలో వస్తున్న మార్పులు వీటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సివిల్ సర్వీస్ పరీక్షలకు ఆమె ప్రిపేర్ అవుతోంది.   ప్రస్తుతం పబ్లిక్ యుటిలిటీ కమీషన్ పూర్తిచేసే పనిలో ఆమె నిమగ్నమైంది. తను కలలుగన్న కలలను నిజం చేసుకునేవరకు, జీవితంలో సుస్థిరంగా స్థిరపడేవరకు పోరాడుతూనే ఉంటానంటోoది.

an-ias-aspirant

ఆటోనడుపుతూ ఐఏఎస్ పరీక్షలకు పోటీపడుతున్న ఎల్లమ్మ, ఐఏఎస్ లో చేరి మహిళలకు అండగా ఉంటూ సహాయపడాలనుకుంటోoది. ఎందుకంటే తను ఒక మహిళ అయి ఉండి ఆటో నడపడానికి ముందుకు వచ్చినప్పుడు మగ ఆటోడ్రైవర్ల నుండి ఎదుర్కున్న వివక్షే ఈ నిర్ణయం తీసుకోవడానికిగల బలమైన కారణం. అలాగే తన ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు ఆమె ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందో, ఆమెను అదేవిధంగా సపోర్ట్ చేస్తున్నారు. తన పయనం,తన లక్ష్యం గురించి, ఆమె కష్టం గురించి తెలుసుకున్నవారు వారు  తమ ప్రయాణానికి చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ డబ్బులు ఆమె చదువుకు ఉపయోగపడుతున్నాయి.

ఏదైనా సాధించాలంటే మనోధైర్యం, అంగీకారం, బలం చాలా అవసరం. అలా తన సమస్యలకు క్రుంగిపోకుండా, ధైర్యంగా ముందుకు వెళ్తూ తన లక్ష్యానికి చేరువవుతోంది ఎల్లమ్మ. ఈ ప్రాసెస్ లో మహిళ అనే వివక్ష చూపకుండా, ఆమె ఆటోలో ప్రయాణం చేస్తూ, ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్న బెంగళూర్ ప్రయాణికులను అభినందించాల్సిoదే. కష్టంతో ముందుకువెళుతూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఎల్లమ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top