క్ల‌ర్క్ TO సిఎం…యడ్యూరప్ప ప్ర‌యాణం.! ఓన‌ర్ కూతురితో ల‌వ్ మ్యారేజ్- వారం రోజులే CM గా చేసిన చ‌రిత్ర‌.!

యడ్యూరప్ప….. ప్ర‌స్తుతం ఈ పేరు హాట్ టాపిక్ ! క‌ర్ణాట‌క సిఎం గా మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప త‌న ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకునే ప‌నుల్లో బిజిబిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ య‌డ్యూర‌ప్ప ఎవ‌రు..? ఆయ‌న రాజ‌కీయ జీవితం ఎలా స్టార్ట్ అయ్యింది.. సిఎం స్థాయికి ఎలా ఎదిగారో క్లుప్తంగా తెలుసుకుందాం.

ప‌ర్స‌న‌ల్ లైఫ్:

త‌న నాలుగేళ్ళ వ‌య‌స్సులో త‌ల్లిని కోల్పోయిన య‌డ్యూర‌ప్ప‌…BA వ‌ర‌కు చ‌దివి., 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్క్ ఉద్యోగంలో చేరారు. త‌ర్వాత ఉద్యోగాన్ని వ‌దిలి ఓ రైస్ మిల్ లో చేరారు…అక్క‌డే ఓన‌ర్ కూతురైన మైత్రిదేవిని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు.వీరికి 5 గురు సంతానం 2 కొడుకులు, మరియు 3కుమారైలు. మైత్రీదేఇ 2004లో మరణించారు.

పొలిటిక‌ల్ లైఫ్:
1970 లో RSS శికారిపుర శాఖకు కార్యదర్శిగా త‌న ప్ర‌జాజీవితాన్ని స్టార్ట్ చేసిన య‌డ్యూర‌ప్ప.. 1980లో బిజెపి ఆవిర్భావంతో శికారిపుర తాలుకా పార్టీ అధ్యక్షుడిగాను, ఆ తరువాత శిమోగా జిల్లా అధ్యక్షుడుగాను ., 1988 నాటికి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగాడు. 1983లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు.( ఇప్ప‌టికి 7 సార్లు).

ముఖ్య‌మంత్రిగా:

  • 2006లో కాంగ్రెస్‌–JDS సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించి., ఆ తర్వాత JDSతో చేతులు కలిపి BJP ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తొలిసారిగా య‌డ్యూర‌ప్ప సీఎంగా ప్రమాణం చేశారు. కానీ JDS మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే త‌న ముఖ్య‌మంత్రి ప‌దివి రాజీనామా చేయాల్సి వచ్చింది.

  • రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ త‌ర్వాత 2008 ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయడంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.2018 లో మ‌రో సారి సిఎం గా ఎన్నిక‌య్యారు..మ‌రి ఈసారైనా సిఎం ప‌దవి ఉంటుందా.? మ‌ద్య‌లోనే ఊడుతుందా.? అనేది చూడాలి.

 

  • యడ్యూరప్ప అస‌లు పేరు యడియూరప్ప.. 2007లో సిఎం సీటు కోల్పోయిన త‌ర్వాత జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా మార్చుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top