బాహుబ‌లి 2 టిక్కెట్ల‌ను బ్లాకులో కొని మ‌రీ సినిమా చూసిన క‌ర్ణాట‌క సీఎం..!

బాహుబ‌లి 2..! ఏ భార‌తీయ సినిమా కూడా సాధించ‌లేని రికార్డుల‌ను సాధిస్తూ, బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో కొన్ని వంద‌ల కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ఇప్ప‌టికే బాహుబ‌లి 2 సాధించి పెట్టింది. దీంతో ఈ క‌లెక్ష‌న్ల సునామీ ఇప్ప‌ట్లో అయితే ఆగేలా క‌నిపించ‌డం లేదు. ఇదిలా ఉంటే చాలా చోట్ల ఇప్ప‌టికీ బాహుబ‌లి 2 సినిమా టిక్కెట్లు దొర‌క‌డం లేదు. మొద‌టి రోజు ఎలా ఉందో ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని టాక్‌. ఈ క్ర‌మంలో సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కే టిక్కెట్లు దొర‌క్క స‌త‌మ‌త‌మ‌వుతుంటే మ‌రోవైపు క‌ర్ణాట‌క సీఎం సిద్ధరామ‌య్య చేసిన పని మాత్రం క‌న్న‌డిగుల‌కు కోపం తెప్పిస్తోంది. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారు..? కొంప‌దీసి సినిమా టిక్కెట్ల రేట్ల‌ను పెంచారా…? కాదు..! బాహుబ‌లి 2 అస‌లు ఆడ‌కుండా ఆ సినిమాను గానీ ఏమైనా బ్యాన్ చేశారా..? లేదు..! మ‌రేమిటి..? ఏమీ లేదండీ… ఆయ‌న ఆ సినిమా చూశారు..! అదీ త‌న 40 మంది కుటుంబ స‌భ్య‌ల‌తో స‌ప‌రివారంగా బాహుబ‌లి 2 ను వీక్షించారు.

అవును. ఇందులో వింతేముందీ..! సినిమా చూడాల‌నిపించి ఉంటుంది, అందుకే చూశారు..! ఇందులో రాద్ధాంతం చేయాల్సిన విష‌యం ఏముందీ..? ఆయ‌న సినిమా చూస్తే క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు కోపం వ‌స్తుందా..? మీరు మ‌రీ చెబుతారు..! అంటారా..? ఆగండి… అయితే అసలు విష‌యం అది కాదు. ఆయ‌న సినిమా చూశారు, క‌రెక్టే..! కానీ… టిక్కెట్ల‌ను ఎలా కొన్నారో తెలుసా.? ఆ… ఏముందీ… వీవీఐపీ క‌దా. ఒకేసారి థియేట‌ర్‌ను బుక్ చేసి చూసి ఉంటారు… అంటారా..? అది కూడా కాదు. అస‌లాయ‌న అలా చేయ‌లేదు. మ‌రి..? అంటే… టిక్కెట్ల‌ను అంద‌రు కొన్న‌ట్టుగా ఆన్‌లైన్‌లోనో లేదంటే బుకింగ్ లైన్ లోనో ఆయ‌న కొన‌లేదు. ఏకంగా బ్లాక్‌లో కొన్నారు..? అవును మ‌రి..! అందుకే క‌న్న‌డిగుల‌కు కోపం వ‌చ్చింది.

మ‌రి ఆయన టిక్కెట్ ఎంత పెట్టి కొన్నారో తెలుసా..? ఒక్క టిక్కెట్‌కు రూ.1050 పెట్టి మ‌రీ మొత్తం 40 టిక్కెట్ల‌కు గాను 1050 x 40 = 42000 పెట్టి మ‌రీ బ్లాక్‌లో టిక్కెట్ల‌ను కొని ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో సహా బెంగుళూరులోని ఓరియ‌న్ మాల్‌లో ఉన్న ఓ స్క్రీన్‌లో గోల్డెన్ క్లాస్‌లో సినిమా చూశారు. త‌న మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల బ‌ల‌వంతం మీదే ఆయ‌న అలా చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌రానంత కోసం వ‌స్తోంది. ఆయ‌నే గ‌తంలో రూ.200కు మించి సినిమా టిక్కెట్ ఉండ‌రాద‌ని ఓ జీవో ఇష్యూ చేయాల‌ని ప్ర‌ణాళిక రూపొందించారు. అయితే అది ఇంకా అమ‌లు కాలేదు. కానీ… ఇంత‌లోపే ఆ నిబంధ‌న‌ను ఆయ‌నే గాలికొదిలి అలా రేటు పెట్టి మ‌రీ టిక్కెట్ల‌ను కొని సినిమా చూడ‌డం క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో ఆయ‌న‌పై ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయినా… సిద్ధ‌రామ‌య్య గారూ… ఏది ఏమైనా మీరే అలా రూల్స్ బ్రేక్ చేయ‌డం బాగా లేదండీ… ఓ వైపు టిక్కెట్ రేటు రూ.200 మించ‌కూడ‌ద‌ని చెబుతూనే… మీరే మ‌రోవైపు అలా బ్లాక్‌లో సినిమా టిక్కెట్ల‌ను కొన‌డం ఏమీ బాగాలేదు. అంత‌గా అయితే థియేట‌ర్‌నే బుక్ చేయాల్సింది. అప్పుడు ఇన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చేవి కావు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top