వారం క్రితం ఓ హైద్రాబాదీ ఫ్లిప్ల్ కార్డ్ కు ఇచ్చిన షాక్ ను మరవక ముందే కరీంనగర్ కు చెందిన ముగ్గురు కుర్రాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీ ఉపయోగించి స్నాప్ డీల్ కు షాకిచ్చారు. ఏకంగా 9 లక్షల రూపాయలకు పైగా స్నాప్ డీల్ సంస్థ కు నష్టం కలిగించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఈఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ కు చెందిన రాపెల్లి మహేష్, బండి యాదస్వామి, మంథని రమాకాంత్ లు స్నేహితులు.
వీరిలో మహేష్ కొన్ని రోజుల క్రితం స్నాప్డీల్లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు మరో వస్తువు పార్శిల్ లో వచ్చింది. వెంటనే కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే ఆ వస్తువును తీసుకున్న ప్రతినిధి డబ్బును వాపస్ ఇచ్చారు.
ఈ విషయంపై మహష్ తన ఇద్దరు స్నేహితులతో చర్చించారు… ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు… అప్పటి నుండి స్నాప్ డీల్ లో ఆర్డర్ ఇవ్వడం.వచ్చిన వస్తువును మార్చడం, వేరే వస్తువు ను డెలివరీ చేశారంటూ స్నాప్ డీల్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయడం…దానికి ఇచ్చేసి, వారి డబ్బును వారు పొందేవారు. ఇలా మొత్తంగా స్నాప్ డీల్ కు 9,14,407 లక్షల వరకు నష్టం కలిగించారు. వీరు టార్గెట్ చేసింది ఎక్కువగా సెల్ ఫోన్లే.
వీరిపై అనుమానంవచ్చిన స్నాప్డీల్ నిర్వాహకులు కూపీ తీయగా అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, వారి నుంచి కొంతమేర నగదును రికవరీ చేశారు.