శ్రీరెడ్డిని “కరాటే కళ్యాణి” కొట్టిందని అందరికి తెలుసు..! కానీ దానికి ముందు అసలేం జరిగిందంటే..? [VIDEO]

సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై  వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..యూట్యూబ్లోనూ,సోషల్ మీడియాలోనూ,మీడియాలోనూ ఇంటర్వ్యూస్లో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషన్ స్టార్ గా నిలిచింది..శ్రీరెడ్డి లీక్స్ పేరుతో రోజుకొకరి పేరు చొప్పున ఇండైరెక్ట్గా కొందరి పేర్లను బయటపెట్టింది..ఇదే క్రమంలో ఒక ఛానెల్లో ఇంటర్వ్యూకి వెళ్లింది శ్రీరెడ్డి..అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణికి,శ్రీరెడ్డికి మధ్య వివాదం పెరగడంతో..కళ్యాణి ,శ్రీరెడ్డిని చంపేస్తానంటూ  గొంతు పట్టుకునేంత వరకు పరిస్తితి వెళ్లింది..ఇంతకూ వివాదం అంతవరకు వెళ్లడానికి కారణం ఏంటి…

కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌న‌ని మాన‌సికంగా, శారీర‌కంగా వేధించార‌ని కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత ర‌మేష్ పుష్పాల‌, ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములపై ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన శ్రీ రెడ్డి రీసెంట్‌గా సింగ‌ర్ శ్రీరామ్ చాటింగ్‌ని బ‌య‌ట‌పెట్టింది. ఇక అక్క‌డితో ఆగ‌కుండా ఆన్‌స్క్రీన్ పై నేచుర‌ల్ స్టార్‌గా ఉన్న నువ్వు.. రియ‌ల్ లైఫ్‌లోను బాగా న‌టిస్తావు అంటూ సోష‌ల్ మీడియాలో మ‌రో లీక్ చేసి క‌ల‌క‌లం సృష్టిస్తుంది.తెలుగు అమ్మాయిలకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని ,ఇచ్చేంత వరకు పోరాటం చేస్తానన్న శ్రీరెడ్డి..ఇటీవల ఒక ఛానెల్లో లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొంది.

కాస్టింగ్ కౌచ్ పై,తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలని నెలరోజులుగా ఈ సమస్యపై మాట్లాడుతున్న సినిమా పరిశ్రమలో పెద్దవాళ్లే లేరా ఈ సమస్యను పరిష్కరించడానికి ..వారంరోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే,తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకపోతే ఫిలిం నగర్లో బట్టలిప్పి తిరుగుతానని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది,దాంతో పక్కనే ఉన్న కరాటే కళ్యాణి ఆడవాల్ల పరువు తీస్తావా నువ్వు,చంపేస్తా నిన్ను అంటూ ఆగ్రహంతో గొంతుపట్టుకున్నారు..ఇద్దరి మధ్య వివాదం తీవ్రమవుతుండడంతో మీరేమైపోతారో అనే బాదతోనే ఆవిడ అలా చేసారంటూ న్యూస్ ప్రజెంటర్ సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top