అంధుల క్రికెటర్లకు అండ‌గా హాస్యన‌టుడు.! 20 ల‌క్ష‌ల‌తో పాటు మ‌ర‌ణాంత‌రం త‌న‌ నేత్రాల‌ను దానం చేస్తాన‌ని ప్రమాణం చేసిన రియ‌ల్ హీరో!

కోహ్లీ,ధోని లాగా వీళ్లు కూడా క్రికెట‌ర్లే, వాళ్ల లాగే వీళ్లు కూడా దేశం కోసం ఆడి, ప్ర‌పంచ‌క‌ప్ ను సాధించారు. బాల్ క‌న‌ప‌డ‌క‌పోయినా…కేవ‌లం అది చేసుకుంటూ వ‌చ్చే శ‌బ్ధాన్ని బ‌ట్టి డైవ్ చేసిమ‌రీ క్యాచ్ లు ప‌ట్టారు. దూసుకొస్తున్న బాల్ ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. తెలివిగా బౌలింగ్ చేశారు…ప్రాణాల‌కు తెగించి మ‌రీ ప్ర‌పంచ‌క‌ప్ ను సాధించారు. వ‌రల్డ్ క‌ప్ ను గెలిచాక టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ కు కోట్ల‌కు కోట్ల అడ్వ‌ర్టైజ్ మెంట్స్, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీలు, జాక్ పాట్ లాంటి ఉద్యోగాలు ద‌క్కాయి…కానీ వీరికి అలా కాదు….అంధుల వ‌రల్డ్ క‌ప్ గెలిచి, దేశం గ‌ర్వప‌డేలా చేసినా …మ‌ళ్లీ గ‌తంలో మాదిరిగా రైళ్ల‌లో దువ్వెన‌లు అమ్ముకోవ‌డం, సెక్యూరిటీ జాబ్ లు చేసుకోవ‌డం, విక‌లాంగుల కోటాలో గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే పించ‌న్ తో కాలం వెల్ల‌దీయడం మాత్ర‌మే మిగిలాయి. అంధుల క్రికెట్ వర‌ల్డ్ క‌ప్ గెలిచిన చాలా మంది ప్లేయ‌ర్స్ ప‌రిస్థితి ఇది.

సింధు ఒలంపిక్స్ లో ఒక్క ర‌జ‌త ప‌త‌కం గెలిస్తే….ఓ తెగ పూన‌కం వ‌చ్చిన‌ట్టు…. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు కుమ్మ‌రించారు.! అడిగిన చోటల్లా స్థ‌లాలు, అడ‌గ‌క‌ముందే ఉద్యోగం సైతం అప్ప‌జెప్పారు.!! అలాంటిది ప్రాణాల‌కు తెగించి మ‌రీ ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన బ్లైండ్ క్రికెట్ ప్లేయ‌ర్స్ మాత్రం నిరాక‌ర‌ణ‌కు గుర‌వుతున్నారు. న‌జ‌రానాల‌ను ప‌క్క‌కు పెడితే వారిని ప్రోత్సాహించ‌డం కూడా మ‌రిచిపోతున్నారు.

కానీ …క‌మెడీ విత్ క‌పిల్ వ్యాఖ్యాత కపిల్ శ‌ర్మ‌…వీరి బాధ‌ను తెలుసుకున్నాడు. అంద‌ర్నీ పిలిచి వారిచేత ప్రోగ్రామ్ చేశాడు. అదే వేదికపై 17 మంది ఆట‌గాళ్ల‌తో స‌హా మొత్తం 20 మందికి త‌లా ఒక్కో ల‌క్ష చొప్పున ఇస్తాన‌ని ప్ర‌మాణం చేశాడు..అంతే కాదు త‌న మ‌ర‌ణాంత‌రం…త‌న నేత్రాల‌ను ఓ అంధ‌ క్రికెట‌ర్  కు దానం చేస్తాన‌ని చెప్పాడు.మ‌రో విశేషం ఏంటంటే….. ప్ర‌పంచ క‌ప్ గెలిచిన బ్లైండ్ టీమ్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ప్లేయ‌ర్ కూడా ఉండ‌డం విశేషం! అదే క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌మెంట్…..ఇండియ‌న్ టీమ్ లో త‌మ రాష్ట్రం త‌ర‌ఫున పాల్గొన్న ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ కు 7 , 7 ల‌క్ష‌ల‌తో పాటు….ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సైతం ఇచ్చింది.మ‌రి మ‌న ప్ర‌భుత్వాలు ఎందుకు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయో !!

Comments

comments

Share this post

scroll to top