పాట్నా రైలు ప్ర‌మాద క్ష‌త‌గాత్రుల‌కు అవ‌మానం.. సాయం పేరుతో చెల్ల‌ని నోట్లు అంట‌గ‌ట్టిన అధికారులు.!

ఇండోర్- పాట్నా రైలు ప్ర‌మాదం 100 మందికి పైగా ప్రాణాల‌ను గాల్లో క‌లిపేసింది. 200 మందిని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల పాలు చేసింది. ఎంద‌రో బాధితులకు త‌మ వారు ఎక్క‌డున్నారో ఏమ‌య్యారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి దారుణ‌మైన పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం కూడా మ‌రింత దారుణానికి ఒడిగ‌ట్టింది. చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఆస్ప‌త్రి నుండి బ‌య‌ట‌కి వెళ్లే ప‌రిస్థితి లేక ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూస్తున్న భాదితుల‌కు సాయం పేరుతో మోసం చేసింది. ఎందుకు ప‌నికి రాని చెల్ల‌ని 500, 1000 రూపాయ‌ల రద్దైన నోట్ల‌ను పరిహ‌రంగా అందించి చేతులు దులుపుకుంది అక్క‌డి రైల్వే.  దీంతో వాటిని ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయారు క్ష‌త‌గాత్రులు.

న‌వంబ‌ర్ 8 అర్థ‌రాత్రి నుండి పెద్ద నోట్లు చెల్ల‌కుండా పోయిన విష‌యం తెలిసింది. నోట్ల మార్పిడికోసం జ‌నం ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విష‌యంలో ప్ర‌జ‌ల నుండి ఇప్పటికే వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. అయితే శ‌నివారం జ‌రిగిన రైల్ ప్ర‌మాద ఘ‌ట‌న‌తో కేంద్రం పై మ‌రింత నిప్పులు చెరుగుతున్నారు నెటిజ‌న్లు. కార‌ణం ఈ ప్ర‌మాదంలో గాయాల పాలైన క్ష‌త‌గాత్రుల‌కు ఆప‌న హస్తం పేరుతో ప‌నికి రాని నోట్లను క‌ట్ట‌బెడుతుండ‌ట‌మే.kanpur-train-accidentkanpuraccidentnotesoldd

ఖాన్పూర్ లోని మాటి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్దునికి న‌ష్ట‌ప‌రిహ‌రం కింద 5000 వేల రూపాయ‌లు ఇచ్చారు అధికారులు. ఇక్క‌డి వర‌కు బాగానే ఉంది. కానీ ఆ ఇచ్చిన 5000 రూపాయ‌లు ఎందుకు ప‌నికి రానివ‌ని తేల‌డంతో త‌ల‌పట్టుకున్నాడు ఆ వృద్దుడు. ఇచ్చిన 5000 రూపాయ‌ల్లో ర‌ద్దు చేసిన ఎనిమిది 500 నోట్లు.. రెండు 1000 రూపాయ‌ల నోట్లు ఉన్నాయి. అయితే అక్క‌డే ఉన్న ఓ అహుస్థాయికుడు ఆ వృద్దుడి చేతిలో ఉన్న డ‌బ్బుల‌ను ఫోటో తీసి నెట్లో పెట్టాడు. ప‌నికి రాని నోట్లతో క్ష‌త‌గాత్రుల పాట్లు.. ఇదేం ప‌రిహ‌రం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ విష‌యం నెట్లో వైర‌ల్ అవ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. చిన్న త‌ప్పింద వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని చెప్పేందుకు ప్రయ‌త్నించింది. కానీ అప్ప‌టికే నెటిజ‌న్లు ఈ చ‌ర్య‌పై దుమ్మెత్తిపోస్తుండ‌టంతో ఎలా స‌మాధానం ఇవ్వాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ప‌డ్డారు అధికారులు.

Comments

comments

Share this post

scroll to top