16 ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారం చేసాడు ఆ నీచమైన తండ్రి..! ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి.!

మ‌న దేశంలో అత్యాచారం, లైంగిక వేధింపులు అనే ప‌దాలు విన‌బ‌డ‌డం స‌హ‌జం అయిపోయింది. ఆ ప‌దాలు విన‌బ‌డని దేశాన్ని మ‌నం ఇక చూస్తామో, లేదో కూడా తెలియ‌డం లేదు. అంత‌గా ఆ విష‌యం స‌ర్వ సాధార‌ణ‌మైంది. అయినప్ప‌టికీ ఆయా నేరాలకు పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష‌లు విధించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌లం అవుతూనే ఉన్నాయి. దీంతో ఆ నేరాల సంఖ్య త‌గ్గ‌డం లేదు సరి క‌దా మ‌రింత పెరుగుతోంది. మృగాళ్లు మ‌రింత రెచ్చిపోతున్నారు. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కూడా మృగాళ్ల పైశాచిక‌త్వానికి అద్దం ప‌డుతోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఓ 16 సంవ‌త్స‌రాల బాలిక ప్రెగ్నెంట్ అయింది. అది కూడా తండ్రి వ‌ల్ల‌. ఆ నీచుడు సొంత కూతురిపైనే గ‌త కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక గ‌ర్భం దాల్చింది. అయితే తాను గ‌ర్భం దాల్చిన‌ట్టు ఆ బాలికకు కూడా తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె బంధువులు అస‌లు విష‌యం గుర్తించ‌డంతో నిజం తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఆ బాలిక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం కేసు కొన‌సాగుతోంది. అయితే ఆ బాలిక‌కు ఇప్పుడు 8వ నెల కావ‌డంతో గ‌ర్భం తీసేయ‌డానికి లేదు. దీంతో ఆ బాలిక తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతోంది.

మ‌రికొద్ది నెల‌లు అయితే ఆ బాలిక 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష రాయాల్సి ఉంది. అంత‌లోనే ఇంత‌టి ఘోరం జ‌రిగింది. గ‌తంలో ఆ బాలిక తండ్రి అత‌ని భార్య‌ను చంపినందుకు గాను జైలు శిక్ష అనుభ‌వించాడు. గ‌త సంవ‌త్స‌రం కింద‌టే జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు. అనంత‌రం త‌న కూతుర్ని సంక్షేమ హాస్ట‌ల్ నుంచి బ‌ల‌వంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఆ త‌రువాత ఆమెపై నీచ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ఏది ఏమైనా ఇలాంటి నీచుల‌ను మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు. క‌ఠినంగా శిక్ష ప‌డాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top