వరుణ్ తేజ్ " కంచె" టీజర్ విడుదల.

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం కంచె… దీనికి వేదం ఫేమ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేశారు.. కంచె అనే టైటిల్ గురించి డైరెక్టర్ క్రిష్ …   ‘కంచె’ అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి ఈ నేపధ్యంలో, 1940ల లో సాగే ఒక కథే ఈ  కంచె అన్నారు.

ఈ సినిమాలో వరుణ్ కు జంటగా   మోడల్ ప్రగ్య జైస్వాల్  నటిస్తుంది. టీజర్లో యుద్ద సన్నివేశాన్ని, ఊరిలో ఉండే తనకు కావాల్సిన ఆమెకు హీరో లెటర్ రాయడాన్ని చూపించారు. దీనిని బట్టి ఈ సినిమాలో హీరో బోర్డర్ లో ఉండే సైనికుడి పాత్ర ను పోషిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమా ఆడియోని ఈ నెల చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయ్.

Watch kanche Trailer Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top