కంచె సినిమాలోని ఈ కింది డైలాగ్స్ లో మీకు బాగా నచ్చిందేంది?

క్రిష్ అంటేనే మద్యతరగతి జీవితాలను, వారి అనుబంధాలను, వెండితెరమీద అద్బుతంగా పలికించే దర్శకుడు. గాలిశీను లోని అంతర్మదనాన్ని ఆవిష్కరించినా…!  కేబుల్ రాజు పాత్రతో  డబ్బు, మనిషి అంటూ రెండు తేడాలను తెలిపినా..!   బిటెక్ బాబు పాత్రతో కళా కళ కోసం కాదంటూ అనాదిగా వస్తున్న సూత్రాన్ని అంతే అందంగా తెరకెక్కించినా..! తాజాగా  దూపాటి హరిబాబు పాత్రతో కులపోరులో ప్రేమ ఉనికిని గురించి తెలియజేసినా అది ఆయనకే చెల్లింది. అందుకే  క్రిష్ సినిమాల ప్రభావం మనుషుల మీద కాదు డైరెక్ట్ గా వారి మనసుల మీదే  ఉంటుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో కంచె సినిమాలోని డైలాగ్స్ చక్కర్లు కొడుతున్నాయ్… ఎంతగా అంటే కామెంట్స్ కు బదులు వీటి ఇమేజెస్ వాడేంతగా..!! అందుకే ఆ సినిమాలో నేను గమనించిన , నాకు గుర్తున్న 12 సూపర్ డైలాగ్స్ ను కింద ఉంచుతున్నాను. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో తెల్పండి.

కంచె సినిమాలోని డైలాగ్స్…( ఇవి డైలాగ్స్ కావ్… నిజజీవిత స్పందనలు):

1) మనిషి గుండె లోని నిజానికి, నిజాయితీకి మధ్య జరిగే యుద్ధమే ‪‎కంచె‬.
2) ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందేమో, కానీ అమ్మతనం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది.
3) ఇది కూడా మన ఊరికథే, అక్కడ జరిగింది ఇక్కడ జరగొద్దు.
4)నేను అంటే మీకు ఇష్టమా? కాదు ప్రేమ! రెండింటికీ తేడా ఏంటి? గులాబీ పువ్వు ఇష్టం ఉంటే తెంచి తలతో పెట్టుకుంటాం, ప్రేముంటే నీళ్ళు పోస్తాం.
5)ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ యుద్దంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేయ యుద్దంలానే ఉంటుంది.!
6) ఇంత పెద్ద విశ్వంలో మనమెంతా? మన పగలు, ప్రతీకారాలెంతా?
7) ‘పొరాటం నీ కోసం కాదు. నా కోసంకాదు. మట్టి కోసం కాదు. మనిషి కోసం కాదు. రేపటి కోసం’ !
8) పాలకోసం ఏడవాల్సిన వయసులో ప్రాణం కోసం యుద్దం చేస్తుంది.
9)మనిద్దరం కలవకపోతే ఊరు చెడిపోయినట్టు,అదే లేచిపోతే ప్రేమ చెడిపోయినట్టు.
10)ఇప్పటి వరకు సైన్యంలో ఉన్నావ్, కానీ ఇప్పుడే నువ్వు సైనికుడివయ్యావ్.
11)మనుషుల మద్య కలిసి బతకలేక, మట్టిలో కలిసి బతుకుతున్నారు.!
12) కులం అంటే పని. మతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు, కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత… వాళ్లు మాత్రమే బతకడానికి కాదు,అందరినీ బ్రతికించడానికి నువ్వు ఎవరూ అని అడిగితే నువ్వు ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు.. అలా అడిగిన వాడు మనిషే కాదు.

Kanche Dialogue Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top