రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..??

కాంచన సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉంది, కాంచన సినిమా దెబ్బకి గంగ మూవీ ఓపెనింగ్స్ స్టార్ హీరో కి వచ్చినట్టు వచ్చాయి, ముని సినిమా పరాజయం అయినా ముని – 2 గా వచ్చిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ హిట్, ఇక ముని – 3 (కాంచన 2) గా వచ్చిన గంగ సినిమా కలెక్షన్స్ సునామి సృష్టించింది. తెలుగు తమిళ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సినీ విమర్శకులను ఆశ్చర్యపరిచింది. కాంచన సినిమా ఇంపాక్ట్ జనాల్లో ఏ రేంజ్ లో ఉందో గంగ సినిమా ద్వారా తెలిసింది. ఇప్పటికీ టీవీ లో గంగ సినిమా వేసినప్పుడల్లా టీ.ఆర్.పి ఎక్కువగానే వస్తుంది.

కాంచన – 3 (ముని 4).. :

ఇప్పుడు ముని సిరీస్ లో 4 వ చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు రాఘవ లారెన్స్, ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో మన ముందుకు రానుంది. జనాల్లో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా కూడా హిట్ అయితే ముని సిరీస్ లో మరో చిత్రం రావడం ఖాయం. సౌత్ లో సీక్వెల్స్ కి క్రేజ్ ఉన్న ఏకైక చిత్రం కాంచన మాత్రమే. కాంచన 3 సినిమాతో జనాల్ని ఎంత నవ్విస్తాడో, మరెంత బయపెడతాడో వేచి చూడాలి. థమన్ మ్యూజిక్ కాంచన సిరీస్ కి పెద్ద ప్లస్ పాయింట్. ‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్’ అంటున్న లారెన్స్ కాంచన 3 ట్రైలర్ మీకోసం..

watch kanchana 3 telugu trailer :

Comments

comments

Share this post

scroll to top